Centre Makes It Mandatory for Disability
Certificates to Be Issued Online
ఆన్‌లైన్ లోనే దివ్యాంగ ధ్రువీకరణ పత్రాలు
- జూన్ నుంచి యూడీఐడీ పోర్టల్‌లో జారీ
దివ్యాంగుల ప్రయోజనాలను సరళీకృతం
చేసేందుకు కేంద్రప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందులో భాగంగా జూన్ 1వ
తేదీ నుంచి అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు యూడీఐడీ
పోర్టల్ ఉపయోగించి మాత్రమే ఆన్‌లైన్ మోడ్ ద్వారా వైకల్య ధ్రువీకరణ పత్రాలను మంజూరు
చేయడం తప్పనిసరి చేస్తూ వికలాంగుల సాధికారత విభాగం గెజిట్ నోటిఫికేషన్ జారీ
చేసింది.
సామాజిక న్యాయం, సాధికారత
మంత్రి నేతృత్వంలోని కేంద్ర సలహా బోర్డు ఈ అంశంపై గతేడాది నవంబర్ 26న చర్చించి, ఈ ఏడాది ఏప్రిల్ 1వ
తేదీ నుంచి ఆన్‌లైన్ వైకల్య ధ్రువీకరణను సిఫారసు చేసింది. అయితే మార్చి, ఏప్రిల్ నెలల్లో జరిగిన ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఆన్‌లైన్ లో
ధ్రువీకరణ పత్రాల జారీని జూన్ 1వ తేదీ నుంచి అమలు చేయాలని నిర్ణయించారు.
0 Komentar