Chhattisgarh 12th Board Exams from
June 1, Students to Take Exams from Home
12వ తరగతి పరీక్షలు: ఇంటి
నుంచి, ఈ విధంగా పరీక్ష రాసుకోవచ్చు...!
కొవిడ్ సెకండ్ వేవ్ ప్రభావం విద్యార్థులపై గట్టిగానే పడింది. సరిగ్గా పరీక్షల నిర్వహణ సమయానికి ఈ మహమ్మారి విరుచుకుపడింది. దీంతో విద్యార్థులకు పరీక్షలు నిర్వహించే విషయంలో రాష్ట్రాలు మల్లగుల్లాలు పడుతున్నాయి. కొన్ని రాష్ట్రాలు పరీక్షలు రద్దు చేయడమో, వాయిదా వేయడమో చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం కొత్త ఆలోచన చేసింది. 12వ తరగతి పరీక్షలను ఓపెన్ బుక్ విధానంలో నిర్వహించాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం విడుదల చేసింది.
జూన్ 1
నుంచి 5వ తేదీలోపు విద్యార్థి ఎప్పుడైనా పరీక్ష
ప్రశ్నాపత్రాన్ని తీసుకోవచ్చు. పరీక్ష రాసిన ఐదు
రోజులకు సమాధాన పత్రాన్ని ఇన్విజిలేటర్‌కు సమర్పించాల్సి ఉంటుంది. ఉదాహరణకు
విద్యార్థి ఒకవేళ ఐదో తేదీన ప్రశ్నాపత్రాన్ని తీసుకెళితే 10వ
తేదీన సమర్పించాల్సి ఉంటుంది. సమాధాన పత్రాన్ని పోస్టులో పంపితే అనుమతించరు.
మొత్తం 2 లక్షల 90 వేల మంది
విద్యార్థులు 12వ తరగతికి బోర్డు వద్ద నమోదు చేసుకున్నారు.
ఇప్పటికే పలు యూనివర్సిటీలు ఇంటి నుంచే పరీక్షలు రాసే వెసులుబాటు కల్పిస్తున్నాయి.
కెమెరాల పర్యవేక్షణలో ఇవి జరుగుతున్నాయి.
0 Komentar