Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Why Cold-Pressed Oil Is Considered Better Than Refined Oil

 

Why Cold-Pressed Oil Is Considered Better Than Refined Oil

కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ రిఫైండ్ ఆయిల్ కంటే ఎందుకు మంచిదిగా భావిస్తారు?

ఆరోగ్యకరమైన జీవనశైలి మీద పెరుగుతున్న ఆదరణతో, గుండె ఆరోగ్యాన్ని పదిలంగా కాపాడుకోవాలన్న ఆలోచనతో ప్రజలు ఈ మధ్య ఎక్కువగా కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్‌ని ఎంచుకుంటున్నారు. రిఫైండ్ ఆయిల్స్, రెగ్యులర్ ఆయిల్స్‌ని పక్కకి పెడుతున్నారు. వండుతున్నప్పుడు కానీ, రుచిలో కానీ ఈ రెండు రకాల ఆయిల్స్ మధ్య తేడా కనుక్కోవడం చాలా కష్టం. ఈ రెండు రకాల ఆయిల్స్ మధ్య తేడా వల్ల వాటి పోషక విలువలోనూ, వాటి కెమికల్ ప్రాపర్టీస్‌లోనూ ఉంది అంటున్నారు నిపుణులు.

కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్‌కి, రెగ్యులర్ ఆయిల్స్‌కి తయారీ విధానంలో,  పోషకాలలో, నిల్వ కాలం లోనూ, వండే విధానం లోనూ ఉండే తేడాలు ఇవే👇

 

నూనెని ఎలా తీస్తారు

నూనెని ఎలా తీస్తారు అనే దాని మీదే ఆ నూనె యొక్క నాణ్యత, పరిమళం ఆధారపడి ఉంటాయి. కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్‌ని తీసేప్పుడు నూనె ఉండే గింజలని తక్కువ వేడి వద్ద ప్రెజర్ ద్వారా తీస్తారు. సాధారణంగా ఈ గింజలని పెద్ద సిలిండర్‌లో వేసి దాన్ని రొటేట్ చేస్తూ ఉంటారు, ఇలా గింజలు అన్నీ క్రష్ అయ్యి నూనె అంతా వచ్చే వరకూ చేస్తారు. ఈ ప్రాసెస్‌లో ఎక్కువ వేడి కానీ, కెమికల్ సాల్వెంట్స్ కానీ ఉండవు. కాబట్టి కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ వాటి వరిజినల్ రుచి, పరిమళం, పోషకాలని కోల్పోకుండా ఉంటాయి. ఈ ఆయిల్స్ కార్డియో వాస్క్యులర్ హెల్త్ కే కాదు, స్కిన్ పైన అప్లై చేసినా కూడా ఎంతో మేలు చేస్తాయి. రెగ్యులర్ ఆయిల్స్‌ని ఎక్కువ వేడి వద్ద కెమికల్ సాల్వెంట్స్ యూజ్ చేసి తీస్తారు, అందుకే వాటి రుచి, పరిమళం, పోషక విలువలు తగ్గుతాయి.

 

పోషకాలు

కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్‌లో ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ ఈ, విటమిన్ కే, విటమిన్ సీ, ఇంకా ఇతర హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయి. అందుకనే కోలప్రెస్డ్ ఆయిల్స్ ని తీసుకోవడం సురక్షితం, ఆరోగ్యకరం అని చెబుతారు. ప్రత్యేకించి క్రానిక్ డిసార్డర్స్ ఉన్న వారికి ఇవి మరీ మంచిది. ప్రాసెస్ చేస్తున్నప్పుడు వాడే అధిక ఉష్ణోగ్రత వల్లా, ఆ తరువాత వాడే ఎసెటిక్ యాసిడ్, హెక్సేన్, బ్లీచింగ్ సోడా వంటి కెమికల్స్ వల్లా రెగ్యులర్ ఆయిల్స్‌లో న్యూట్రియెంట్స్ అన్నీ నశించిపోతాయి. కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ తీసుకోవడం వల్ల బ్లడ్ ప్రెజర్ లెవెల్స్, చెడు కొలెస్ట్రాల్ లెవెల్స్ రెడ్యూస్ అయ్యి గుండె ఆరోగ్యన్ని కాపాడుకోగలిగితే, రిఫైండ్ ఆయిల్స్ ని రెగ్యులర్‌గా, రోజు వారీ ఆహారంలో తీసుకోవడం వల్ల హార్ట్ ఎటాక్స్, స్ట్రోక్ వచ్చే రిస్క్ గణనీయంగా పెరుగుతుంది.  


ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది:

రెగ్యులర్ ఆయిల్స్‌లో హైడ్రోజెనేషన్ ప్రాసెస్ జరుగుతుంది. అవి ఆ తరువాత కూడా హానికారక కెమికల్స్ తో ట్రీట్ చేయబడతాయి. ఇందువల్ల వాటి షెల్ఫ్ లైఫ్ పెరుగుతుంది, ఎక్కువ ఆయిల్‌ని కూడా ఎక్స్ట్రాక్ట్ చేయగలుగుతారు. కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్‌లో ప్రాసెసింగ్ చాలా తక్కువ, పైగా అవి అన్‌ఫిల్టర్డ్ కాబట్టి వాటి షెల్ఫ్ లైఫ్ తక్కువగా ఉంటుంది. ఆయిల్ కూడా తక్కువే ఎక్స్ట్రాక్ట్ చేయగలుగుతారు. అందుకే, క్వాలిటీ ఎక్కువగా ఉండే కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ కంటే రెగ్యులర్ ఆయిల్స్ కొంచెం తక్కువ ఖరీదులో లభిస్తాయి.

 

వంట సమయం లో సూచనలు:

కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ యొక్క స్మోకింగ్ పాయింట్ తక్కువ. అందుకే అవి తక్కువ, లేదా మీడియం హీట్‌తో వండే పదార్ధాలకి బాగా ఉపయోగపడతాయి. రెగ్యులర్ ఆయిల్స్ యొక్క స్మోకింగ్ పాయింట్ ఎక్కువ. అందుకే అవి హై టెంపరేచర్స్‌లో వండే పదార్ధాలకి బాగా ఉపయోగపడతాయి. 

రెగ్యులర్ ఆయిల్స్ పక్కన పెట్టి కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ వాడడం కొంచెం కష్టమైనది, కొద్దిగా ఖరీదుతో కూడుకున్నది కానీ, ఈ చిన్న మార్పు మీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మంచి హార్ట్ హెల్త్ కోసం మీ ఆహారం లో ఇంక్లూడ్ చేసుకోగలిగిన కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్‌లో కొబ్బరి నూనె, ఆలివ్ ఆయిల్, సన్ ఫ్లవర్ ఆయిల్, గ్రౌండ్ నట్ ఆయిల్, ఫ్లాక్స్ సీడ్ ఆయిల్, వాల్ నట్ ఆయిల్, బొరేజ్ ఆయిల్ వంటివి ఉన్నాయి. 

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం.

Previous
Next Post »
0 Komentar

Google Tags