Covid Vaccination: Limited On-Site
Registration Allowed For 18-44 At Government Centres
18-44 ఏళ్ల వారికీ నేరుగా ఆన్‌సైట్
రిజిస్ట్రేషన్ - ప్రస్తుతానికి ప్రభుత్వ టీకా
కేంద్రాల్లోనే!
కొవిన్ యాప్‌లో అపాయింట్‌మెంట్లు
దొరకడం గగనంగా మారిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆ విధానాన్ని కాస్త సడలించింది. 18-44 ఏళ్ల వయసులోపు లబ్ధిదారులు ప్రభుత్వ టీకా కేంద్రాలకు నేరుగా వెళ్లి ఆన్‌సైట్
రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం కల్పించింది. వివిధ వర్గాల నుంచి వచ్చిన
విజ్ఞప్తులను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ
సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఇక నుంచి 18-44 ఏళ్ల వయసు
వారు కూడా ఆన్‌సైట్ రిజిస్ట్రేషన్ కానీ, కొవిన్ యాప్‌లో
కానీ రిజిస్ట్రేషన్ చేసుకొని ప్రభుత్వ కేంద్రాల్లో టీకా తీసుకోవచ్చని పేర్కొంది.
ప్రస్తుతానికి ఆన్‌సైట్ సౌకర్యాన్ని ప్రైవేటు టీకా సెంటర్లకు వర్తింపజేయడం లేదని
తెలిపింది. ఆ సెంటర్లు తమ వ్యాక్సినేషన్ షెడ్యూల్‌ను పూర్తిగా ఆన్‌లైన్ అపాయింట్‌మెంట్స్
ప్రకారమే కొనసాగించాలని పేర్కొంది.
* ప్రభుత్వ కేంద్రాల్లో ఈ
కొత్త సౌకర్యం ఆయా రాష్ట్ర ప్రభుత్వాల అంగీకారం మేరకే అమలవుతుందని స్పష్టం
చేసింది. 18-44 ఏళ్లవారు ఆన్‌సైట్ రిజిస్ట్రేషన్
చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతించినప్పుడు...ఆన్‌లైన్‌లో అపాయింట్‌మెంట్
తీసుకున్న వారితో పాటు వీరికీ టీకా అందించాలని, దీనివల్ల
టీకా వృథా తగ్గుతుందని తెలిపింది.
* ఆన్‌సైట్ రిజిస్ట్రేషన్
ద్వారానే ప్రత్యేక సెషన్లు నిర్వహించి టీకా అందించవచ్చని, అలా
చేసేటప్పుడు టీకా డోసులు వృథా కాకుండా తగిన సంఖ్యలో లబ్ధిదారులను సమీకరించాలని
పేర్కొంది. ఇలాంటి చర్యలు తీసుకున్నప్పుడు సెంటర్ల దగ్గర జనం గుమికూడి రద్దీ
పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించింది.
* ప్రభుత్వ కేంద్రాల కోసం
ఆన్‌లైన్‌లో అపాయింట్‌మెంట్ తీసుకున్నవారు ఏదైనా కారణాల వల్ల రాలేకపోతే మిగిలిన
టీకా డోసులను ఆన్‌సైట్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి ఇవ్వాలని పేర్కొంది.
0 Komentar