COVID Vaccine Certificate Should Never
Be Shared on Social Media Platforms says Govt
కోవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్‌ను
సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారా? – కేంద్రం కీలక సూచనలు
కోవిడ్ వ్యాక్సీన్ తీసుకున్న వారు చాలా మంది తమ తమ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడం చాలా చూస్తూనే ఉన్నాం. ఇంకొందరు వ్యాక్సిన్ తీసుకున్న సర్టిఫికెట్లను సైతం షేర్ చేస్తున్నారు. అయితే, ఇది చాలా ప్రమాదకరం అని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఎవరు కూడా తమ టీకా సర్టిఫికెట్‌ను సోషల్ మీడియాలో షేర్ చేయవద్దని వార్నింగ్ ఇస్తున్నారు.
వ్యాక్సీన్ కోసం అప్లై చేసుకుని వ్యాక్సీన్ వేయించుకున్న తరువాత సంబంధిత ధ్రువపత్రం లబ్ధిదారుల మొబైల్ నెంబర్, ఈమెయిల్‌కు వస్తుంది. టీకా వేయించుకున్నట్లుగా చూపించడానికి ఇది ఉపకరిస్తుంది. వ్యాక్సీన్ ధ్రువపత్రంలో లబ్ధిదారుల వివరాలు అన్నీ ఉంటాయి. అంటే ఆధార్ నెంబర్ సహా ఇతరత్రా వివరాలు అందులో ఉంటాయి. అయితే, కొందరు వ్యక్తులు తమ టీకా సర్టిఫికెట్‌ను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఇది చాలా ప్రమాదాకరం అని, సైబర్ నేరస్తుల చెరకు చిక్కే ప్రమాదం ఉందని సైబర్ భద్రతా సిబ్బంది ప్రజలను హెచ్చరిస్తున్నారు. ఈ సర్టిఫికెట్‌ను సోషల్ మీడియాలో అస్సలు షేర్ చేయవద్దని సూచిస్తున్నారు.
కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ సైతం ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. ఈ శాఖకు చెందిన సైబర్ అవేర్‌నెస్ విభాగం ట్విట్టర్ ద్వారా ప్రజలకు కీలక సూచనలు చేసింది. టీకా సర్టిఫికెట్‌నుు సోషల్ మీడియాలో పంచుకోవడం ద్వారా వ్యక్తులకు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని దొంగిలించే అవకాశం ఉందన్నారు. ఆధార్ నెంబర్ ఆధారంగా బ్యాంక్ ఖాతాల నుంచి డబ్బును తస్కరించే ప్రమాదం ఉందన్నారు. దీన్ని నిలువరించాలంటే.. సర్టిఫికెట్‌ను గోప్యంగా ఉంచుకోవాలన్నారు.ఇదిలాఉండగా, కరోనా
వ్యాక్సిన్ పేరుతో ప్రస్తుతం చాలా మోసాలు వెలుగు చూస్తున్నాయి. టీకా సర్టిఫికెట్
సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం వలన, ఫోన్ నెంబర్లు సేకరించిన
సైబర్ నేరగాళ్లు టీకా తీసుకున్న తరువాత ప్రజలను ఫీడ్‌బ్యాక్ అడుగుతూ కాల్స్
చేస్తున్నట్లు అధికారుల దృష్టికి వచ్చింది. హ్యాకింగ్ జరుగుతున్న నేపథ్యంలోనే, గుర్తు తెలియని కాల్స్ వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వ వర్గాలు
ప్రజలను అప్రమత్తం చేస్తున్నాయి. ప్రభుత్వం నుంచి ఎలాంటి ఫోన్ కాల్స్ రావని,
టీకా తీసుకున్నట్లు అడగం లేదని పిఐబి స్పష్టం చేసింది.
Beware of sharing #vaccination certificate on social media: pic.twitter.com/Tt9vJZj2YK
— Cyber Dost (@Cyberdost) May 25, 2021
0 Komentar