Defer Vaccination For 9 Months After
Covid Recovery, Suggests Govt Panel
కరోనాను జయించిన 9 నెలల
తర్వాతే టీకా – NTAGI
కొవిడ్-19
నుంచి కోలుకున్న 9 నెలల తర్వాత వ్యాక్సిన్ తొలిడోసు తీసుకుంటే
మరింత మెరుగైన ఫలితాలు ఉంటాయని టీకా కార్యక్రమంపై ఏర్పడిన జాతీయ సాంకేతిక సలహా
బృందం (ఎన్‌టీఏజీఐ) సిఫార్సు చేసింది. వ్యవధి ఎక్కువగా ఉంటే.. శరీరంలో యాంటీబాడీలు
మరింత ఎక్కువగా వృద్ధి చెందుతాయని తెలిపింది.
గతంలో ఆరు నెలల వ్యవధి ఉండాలని
సూచించిన ఈ కమిటీ, ఇప్పుడు దాన్ని తొమ్మిది నెలలకు పెంచాలంటూ
కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. దీనిపై కేంద్ర ఆరోగ్యశాఖ ఒకట్రెండు రోజుల్లో
నిర్ణయం తీసుకునే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఈ శాఖ ప్రస్తుత మార్గదర్శకాల
ప్రకారం.. కరోనా బారినపడ్డవారు కోలుకున్నాక 4-8 వారాల తర్వాత
కొవిడ్ టీకా తీసుకోవచ్చు. కొవిడ్ విజేతలు ఆరు నెలలకు తొలి డోసు టీకా తీసుకుంటే
మంచిదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) చెబుతోంది.
0 Komentar