Few States See Symbolic Start To 3rd
Phase of Covid-19 Vaccination Drive
కొన్ని రాష్ట్రాల్లో మూడో దశ టీకా కార్యక్రమం ప్రారంభం
కరోనా రెండో దశ ఉద్ధృతి
కొనసాగుతున్న తరుణంలో భారత్‌లో శనివారం మూడో దశ టీకా కార్యక్రమం కొన్ని
రాష్ట్రాల్లో ప్రారంభమైంది. అదే సమయంలో టీకా కొరత కారణంగా కొన్ని రాష్ట్రాల్లో
మొదలవలేదు. ఉత్తర్‌ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర,
జమ్మూ-కశ్మీర్, కొన్ని కేంద్రపాలిత ప్రాంతాలు
18-44 ఏళ్ల వారికి టీకాలు వేసే కార్యక్రమాన్ని
ప్రారంభించాయి. కర్ణాటక, ఒడిశా రాష్ట్రాలు లాంఛనంగా మాత్రమే
ప్రారంభించాయి. టీకాలను రాష్ట్రాలకు అందుబాటులో ఉంచడంలో కేంద్ర సంస్థలు
విఫలమయ్యాయని మండిపడ్డ ఝార్ఖండ్ టీకాలు అందాక మూడో దశకు సంబంధించి కొత్త తేదీలు
ప్రకటిస్తామని పేర్కొంది.
* ఉత్తర్‌ప్రదేశ్‌లో 9,000 కంటే ఎక్కువ కేసులున్న లఖ్‌నవూ, కాన్పుర్, ప్రయాగ్‌రాజ్, వారణాసి, గోరఖ్‌పుర్,
మేరఠ్, బరేలీల్లో మూడో దశ టీకాల కార్యక్రమం
మొదలైంది.
* ఛత్తీస్‌గఢ్‌లోని 16 జిల్లాలో 1,693 మందికి (18-44
వయసు వారు) టీకాలు వేశారు.
* ఒడిశా లాంఛనప్రాయంగా
ప్రారంభించింది. సోమవారం నుంచి అక్కడ మూడో దశ పూర్తిస్థాయిలో మొదలవుతుంది.
* మహారాష్ట్రలోని పుణెలోని
కమలా నెహ్రూ ఆసుపత్రిలో 18 నుంచి 44
ఏళ్ల మధ్య వయసు కలిగినవారికి టీకా అందిస్తున్నారు. టీకా లేనందున మూడో దశ
కార్యక్రమం రాష్ట్రంలో ఆలస్యంగా ప్రారంభం కానుందని కేరళ రాష్ట్ర ప్రభుత్వం
తెలిపింది.
* మూడో దశలో భాగంగా నెలకొనే
రద్దీని తట్టుకునే సంఖ్యలో తమ దగ్గర టీకా నిల్వలు లేవని తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరిలు శుక్రవారమే ప్రకటించిన
సంగతి తెలిసిందే.
* టీకా డోసులు లేనందున
అస్సాంలో కార్యక్రమం మొదలవలేదు.
* హైదరాబాద్, కోల్‌కతాలో తాము మూడో దశ టీకాల కార్యక్రమం ప్రారంభించినట్లు అపోలో
ఆసుపత్రి వర్గాలు చెప్పాయి. 18-44 వయసు వారికి కరోనా టీకాలు
వేసే కార్యక్రమాన్ని సోమవారం నుంచి ప్రారంభిస్తామని దిల్లీ సీఎం కేజ్రీవాల్
శనివారం ప్రకటించారు.
* మూడోదశ టీకాకు సంబంధించి
తొలిరోజు 18-45 ఏళ్ల వారిలో 84,599
మందికి తొలి డోసు టీకా అందించినట్లు
కేంద్రం తెలిపింది.
రాష్ట్రాల వద్ద 79
లక్షల డోసులు
దేశంలోని రాష్ట్రాలు, కేంద్రపాలిత
ప్రాంతాల వద్ద టీకా డోసులు 79 లక్షలకుపైగా అందుబాటులో
ఉన్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ శనివారం ప్రకటించింది.
0 Komentar