First Batch of DRDO's Anti-Covid Drug 2-DG to be Releasing Today
డిఆర్‌డిఒ కొవిడ్ డ్రగ్ 2డిజి – నేటి నుంచి పంపిణీ ప్రారంభం
ఢిల్లీలోని ఆసుపత్రులకు 10వేల డోసులు అందించనున్న రక్షణ మంత్రి రాజ్‌నాథ్
దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతున్న
వేళ ఈ మహమ్మారి కట్టడికి మరో ఔషధం అందుబాటులోకి రానుంది. రక్షణ పరిశోధన, అభివృద్ధి
సంస్థ(డిఆర్‌డిఓ) దేశీయంగా అభివృద్ధి చేసిన 2డిజి డ్రగ్ సోమవారంనుంచి అత్యవసర
వినియోగం కోసం అందుబాటులోకి రానుంది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ దేశ రాజధాని
ఢిల్లీలోని కొన్ని ఆస్పత్రులకు దాదాపు 10,000 డోసులను పంపిణీ చేస్తారు.
2డి ఆక్సీడి గ్లూకోజ్ లేదా 2డిజిగా
పిలవబడే ఈ డ్రగ్‌ను డిఆర్‌డిఓ ల్యాబ్‌లో హైదరాబాద్‌కు చెందిన ఫార్మాసంస్థ డాక్టర్
రెడ్డీస్ సహకారంతో అభివృద్ధి చేశారు. డ్రగ్ కంట్రోలర్ డిజిసిఐ ఈ ఔషధం అత్యవసర
వినియోగానికి కొద్ది రోజలు క్రితమే అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. పౌడరు రూపంలో
ఉండే ఈ మందును నీళ్లలో కలిపి నోటిద్వారా తీసుకోవాలి. ఈ డ్రగ్‌కు సంబంధించి
నిర్వహించిన రెండు, మూడు దశల ట్రయల్స్‌లో ఇది కొవిడ్ వైరస్‌ను
సమర్థవంతంగా కట్టడి చేయడంలో సమర్థవంతంగా పని చేస్తుందని రుజువైంది.
0 Komentar