GATE 2022: Two New Papers in Exam, More
Exam Centres Likely
గేట్-2022 లో 2 కొత్త సబ్జెక్టులు -
చిన్న పట్టణాల్లోనూ పరీక్ష కేంద్రాలు – ఐఐటి ఖరగ్ పుర్ నిర్వహణ
వచ్చే ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించే
గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్(గేట్-22)లో మరో రెండు
సబ్జెక్టులను చేర్చాలని ఐఐటీలు నిర్ణయించాయి. గత పరీక్ష (గేట్-21)ను 27
సబ్జెక్టుల్లో నిర్వహించగా ఈసారి అదనంగా నావల్ ఆర్కిటెక్చర్ అండ్ మెరైన్
ఇంజినీరింగ్, జియోమేటిక్ ఇంజినీరింగ్ పేపర్లను ప్రవేశపెట్టనున్నారు.
అంటే మొత్తం 29 సబ్జెక్టుల్లో పరీక్ష జరగనుంది. గత పరీక్ష నుంచి ఒకటికి మించి
పేపర్లను ఎంపిక చేసుకోవడం.. ఆర్ట్స్, కామర్స్ విద్యార్థులకూ
గేట్ రాసే అవకాశం కల్పించిన విషయం తెలిసిందే.
ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన గేట్
పరీక్షకు అదనంగా కొన్ని పట్టణాల్లో కేంద్రాలు ఏర్పాటు చేశారు. వచ్చే ఏడాది
పరీక్షకు మరిన్ని కేంద్రాలను అందుబాటులోకి తేవాలని, చిన్న
పట్టణాల్లోనూ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీనిపై ఐఐటి బొంబాయి సంచాలకుడు
దీపాంకర్ చౌదరి ఆధ్వర్యంలో ఓ కమిటీని నియమించారు.
సెప్టెంబరు నుంచి దరఖాస్తులు!
గేట్ 2022కు సెప్టెంబరు నుంచి
దరఖాస్తుల ప్రక్రియ మొదలయ్యే అవకాశం ఉంది. ఈ ఏడాది పరీక్షను ఐఐటీ బొంబాయి
నిర్వహించగా వచ్చే ఏడాది గేట్ నిర్వహణ బాధ్యత ఐఐటీ ఖరగ్ పుర్ కు దక్కింది. తాజాగా
ముంబయిలో జరిగిన నేషనల్ కోఆర్డినేషన్ బోర్డు(ఎన్‌సీబీ) సమావేశంలో ఈ నిర్ణయాలు
తీసుకున్నారు.
తెలుగు రాష్ట్రాల నుంచి 1.25 లక్షల
మంది...
ఈ ఏడాది నిర్వహించిన గేటు
దేశవ్యాప్తంగా 8.82 లక్షల మంది దరఖాస్తు చేశారు. ఇందులో తెలుగు రాష్ట్రాల నుంచి
దాదాపు 1.25 లక్షల మంది ఉన్నారు.
గేట్ ర్యాంకుకు మూడేళ్లపాటు విలువ
ఉంటుంది. ఈ ర్యాంకుతో ఐఐటీలు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్
సైన్స్(ఐఐఎస్ సీ)ల్లో ఎంటెక్, పీహెచ్ డీ చేయవచ్చు. పలు
కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు గేట్ ర్యాంకు ప్రాతిపదికగా ఉద్యోగాలకు ఎంపిక
చేసుకుంటున్నాయి.
0 Komentar