Google Pay Launches International Money
Transfers with Wise and Western Union
గూగుల్ పే కొత్త సేవలు - అంతర్జాతీయ నగదు బదిలీ సేవలు ప్రారంభం
గూగుల్ పే కొత్త సేవలు
అందుబాటులోకి తీసుకువచ్చింది. అంతర్జాతీయ నగదు బదిలీ సేవలు ఆవిష్కరించింది. ఇవి
ప్రస్తుతం కేవలం అమెరికాలో మాత్రమే అందుబాటులో ఉంటాయి. అంటే అమెరికా గూగుల్ పే
కస్టమర్లు ఇతర దేశాల వారికి డబ్బులు పంపొచ్చు.
గూగుల్ అల్ఫాబెట్ కంపెనీకి చెందిన గూగుల్ పే తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది. అంతర్జాతీయ నగదు బదిలీ సర్వీసులు లాంచ్ చేసింది. దీంతో గూగుల్ పే వాడే వారు విదేశాలకు డబ్బుల పంపొచ్చు.
గూగుల్ పే తన ఇంటర్నేషనల్ మనీ
ట్రాన్స్‌ఫర్ సర్వీసుల కోసం రెమిటెన్స్ సంస్థలైన వైజ్, వెస్ట్రన్
యూనియన్ వంటి వాటితో భాగస్వామ్యం కుదుర్చుకుంది. అయితే ఈ సేవలు కేవలం అమెరికాలో
గూగుల్ పే వాడే వారికి మాత్రమే అందుబాటులో ఉంటాయి.
అంటే అమెరికాలో ఉన్న వారు భారత్, సింగపూర్ వంటి దేశాలలో తమ వారికి డబ్బులు పంపొచ్చు. ఈ ఏడాది చివరకు దాదాపు చాలా దేశాలకు ఈ సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. గూగుల్ పే ఎంట్రీతో రెమిటెన్స్ మార్కెట్లో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకోవచ్చు.
కోవిడ్ 19
సమయంలో గూగుల్ పే కొత్త సర్వీసుల వల్ల ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్లు మారింత పెరిగే
ఛాన్స్ ఉంది. ఇకపోతే వెస్ట్రన్ యూనియన్ రెమిటెన్స్ మార్కెట్‌లో లీడర్‌గా
కొనసాగుతున్న విషయం తెలిసిందే. అలాగే వైజ్ కంపెనీ కూడా చౌక చార్జీలతో ఇంటర్నేషనల్
మనీ ట్రాన్స్‌ఫర్ ఆఫర్ చేస్తోంది.
Starting this week, Google Pay users in the U.S. can send money to Google Pay users in India and Singapore. By the end of the year, U.S. Google Pay users will be able to send money to people in more than 200 countries. 🌎 https://t.co/IxBviWYEfs
— Google Pay (@GooglePay) May 11, 2021
0 Komentar