Google users can now password-protect
page that shows search activity
Google: ఇకపై యాక్టివిటీ
పేజీకి పాస్‌వర్డ్
ప్రముఖ సెర్చింజన్ గూగుల్ తమ వినియోగదారుల కోసం మరో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. వినియోగదారుల యాక్టివిటీకి అదనపు భద్రతను జోడిస్తున్నట్లు గూగుల్ ప్రకటించింది. షేరింగ్ డివైజ్ వాడే సమయంలో వినియోగదారులు తమ సెర్చింగ్స్‌ను గోప్యంగా ఉంచేందుకు ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చారు.
ఎలా యాక్టివేట్ చేయాలంటే..
ఈ ఫీచర్‌ను యాక్టివేట్ చేసుకొనేందుకు యాక్టివిటీ.గూగుల్.కాం పై క్లిక్ చేసి ‘మేనేజ్ మై యాక్టివిటీ’అనే లింక్‌పై క్లిక్ చేయాలి. తర్వాత ఈ సెట్టింగ్స్‌ని సేవ్ చేసుకొని పాస్‌వర్డ్ పెట్టుకోవాలి. ఈ ఫీచర్‌ను యాక్టివేట్ చేసుకున్న తర్వాత వినియోగదారులు గూగుల్ ఖాతా పాస్‌వర్డ్‌తో లాగిన్ అవ్వాలి. తర్వాత యాక్టివిటీ పేజ్‌లోకి వెళ్తే పాస్‌వర్డ్‌ను అడుగుతుంది. అప్పుడు యాక్టివిటీ పేజీని మనం యాక్సెస్ చేయగలం. ఇది గూగుల్ వినియోగదారులకు అదనపు భద్రతను కల్పిస్తుంది. ఒకవేళ వినియోగదారులు యాక్టివిటీ హిస్టరీని పూర్తిగా డిలీట్ చేయాలన్నా పాస్‌వర్డ్ ఎంటర్ చేయాల్సిందే.
ఈ కొత్త ఫీచర్ ద్వారా
వినియోగదారులు తమ యాక్టివిటీని ట్రాక్ చేసుకోవడంతో పాటు ఏదైనా విలువైన సమాచారం
ఉంటే కోల్పోకుండా ఉంటారు అని గూగుల్ ఒక ప్రకటనలో తెలిపింది. తాజాగా వినియోగదారులకు ఉపయోగకరంగా ఉండే మరొకొన్ని
కొత్త ఫీచర్లను గూగుల్ అందుబాటులోకి తెచ్చింది. ఆండ్రాయిడ్ ఫోన్‌లో గూగుల్ యాప్‌పై
రెండు సార్లు నొక్కితే సెర్చ్ బార్ వచ్చేలా చేయడంతో పాటు ఒక్క సారి ట్యాప్
చేస్తే గత 15 నిమిషాల యాక్టివిటీ కంపెనీ సర్వర్ నుంచి డిలీట్ చేసుకొనేందుకు
వీలుగా ఆ ఫీచర్లను అందుబాటులోకి తెచ్చారు. అంతే కాకుండా వ్యక్తిగత ఫొటోలుండే
ఫోల్డర్లకు పాస్‌వర్డ్ పెట్టుకొనే అవకాశాన్ని కూడా కల్పించారు.
0 Komentar