Government Extends Payment of
Provisional Pension Up to 1 Year
పదవీ విరమణ తర్వాత ఏడాది వరకూ తాత్కాలిక పింఛను - కొవిడ్ నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం
తాత్కాలిక పింఛనుకు సంబంధించిన నిబంధనలను కేంద్ర ప్రభుత్వం సరళీకరించింది. ఉద్యోగులు పదవీ విరమణ పొందిన తేదీ నుంచి ఏడాది వరకూ తాత్కాలిక పింఛను చెల్లించేలా గడువును పొడిగించింది. కొవిడ్ పరిస్థితుల నేపథ్యంలో ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర సిబ్బంది శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ బుధవారం వెల్లడించారు.
అర్హులైన కుటుంబ సభ్యులు కుటుంబ పింఛను
క్లెయిము రసీదు, మరణ ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించిన వెంటనే పింఛనును
మంజూరు చేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. సంబంధిత క్లెయిమును చెల్లింపు,
పద్దుల కార్యాలయానికి పంపించి ఎదురుచూడాల్సిన అవసరం ఇకపై
ఉండబోదన్నారు. జాతీయ పింఛను పథకం (ఎన్‌పీఎస్) పరిధిలోని ఉద్యోగులు విధి నిర్వహణలో
వైకల్యం బారిన పడి, ప్రభుత్వ సర్వీసులో కొనసాగితే.. వారికి
కూడా ఏకమొత్తంలో అధిక పరిహారం చెల్లించే ప్రయోజనాన్ని వర్తింపజేయాలని
నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు.
0 Komentar