Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Govt Extends FY-2021 Income Tax Return Filing Deadline

 

Govt Extends FY-2021 Income Tax Return Filing Deadline

IT Returns: ఐటీ రిటర్న్స్‌ గడువు పొడిగింపు

ఐటీ రిటర్న్స్‌ పాత, కొత్త పోర్టల్ వివరాలు ఇవే 

కరోనా నేపథ్యంలో పన్ను చెల్లింపుదారులకు కేంద్రం ఊరట కల్పించింది. ఐటీ రిటర్నుల దాఖలు గడువును పొడిగించింది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వ్యక్తుల రిటర్నుల దాఖలు గడువును సెప్టెంబర్‌ 30 వరకు పొడిగించింది. కంపెనీలకు సైతం రిటర్నుల దాఖలుకు నవంబర్‌ 30 వరకు అవకాశం ఇచ్చింది. కొవిడ్‌ వేళ పన్ను చెల్లింపుదారులకు ఊరట కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్ట్‌ ట్యాక్సెస్‌ (సీబీడీటీ) వెల్లడించింది. వ్యక్తులకు ఇప్పటి వరకు రిటర్నుల దాఖలుకు జులై 31, కంపెనీలకు అక్టోబర్‌ 31గా సీబీడీటీ గడువు ఉండేది. కంపెనీలు తమ ఉద్యోగులకు జారీ చేసే ఫారం -16 గడువును సైతం సీబీడీటీ పొడిగించింది. జులై 15 వరకు ఇందుకు గడువును నిర్దేశించింది. 

ఆదాయ‌పు ప‌న్ను రిట‌ర్నుల దాఖ‌లును సుల‌భ‌త‌రం చేసేందుకు కొత్త ఈ-ఫైలింగ్‌ పోర్టల్‌ను ఐటీ శాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది. పాత పోర్టల్  స్థానంలో కొత్తపోర్టల్ ను తీసుకొచ్చింది. జూన్‌ 7 నుంచి ఈ కొత్త పోర్టల్‌ అందుబాటులోకి రానుంది. అయితే, జూన్‌ 1 నుంచి 6వ తేదీ వరకు పాత పోర్టల్‌ పన్ను చెల్లింపుదారులకు అందుబాటులో ఉండదని ఐటీ శాఖ పేర్కొంది.

* జూన్‌ 7 నుంచి ఈ కొత్త పోర్టల్‌ అందుబాటులోకి రానుంది.

* జూన్‌ 1 నుంచి 6వ తేదీ వరకు పాత పోర్టల్‌ పన్ను చెల్లింపుదారులకు అందుబాటులో ఉండదు.

Launch of new E-filing Portal Income Tax Department – Non-availability of e-Filing services from 01-06-2021 to 06-06-2021 Reg.

DOWNLOAD NOTE ON ITR WEBISTES

CURRENT (OLD) ITR WEBSITE

NEW ITR WEBSITE  (Active from 07-06-2021)

Previous
Next Post »
0 Komentar

Google Tags