Govt extends timelines for tax
compliance, ITR for FY20 can be filed till May 31
2020-21 మదింపు
సంవత్సరానికి (AY) రిటర్న్‌ల గడువు పొడిగింపు
గత ఆర్థిక సంవత్సరం (2019-20) లేదా 2020-21 మదింపు సంవత్సరానికి రిటర్న్‌లను మే 31వ తేదీ వరకు సమర్పించేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఇంతకుముందు ఈ
గడువు తేదీ 2021 మార్చి 31గా ఉంది.
‘కొవిడ్-19 మహమ్మారి ప్రభావంతో నెలకొన్న ప్రతికూల పరిణామాల
నేపథ్యంలో వివిధ వర్గాల నుంచి వచ్చిన వినతుల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకుంది.
‘ఆదాయపు పన్ను చట్టంలోని 139 సెక్షన్‌లో సబ్‌సెక్షన్ (5) కింద సవరించిన రిటర్న్‌లను,
సబ్‌సెక్షన్ (4) కింద ఆలస్యమైన రిటర్న్‌లను 2021 మార్చి 31న లేదా ఆలోగా సమర్పించాల్సి ఉండేది. అయితే
ఈ తేదీని మే 31వ తేదికి పొడిగించామ’ని కేంద్ర ప్రత్యక్ష
పన్నుల బోర్డు (సీబీడీటీ) తెలిపింది.
0 Komentar