Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాదించిన తొమ్మిదేళ్ల తెలుగు అమ్మాయి

 

గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాదించిన తొమ్మిదేళ్ల తెలుగు అమ్మాయి

తక్కువ సమయం లో రసాయన శాస్త్రంలోని మూలకాల ఆవర్తన పట్టికను అమర్చి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం  

తొమ్మిదేళ్ల వయస్సు లోనే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో గుంటూరు జిల్లా చిలకలూరిపేట చిన్నారి ఫజీలా తబస్సుమ్ స్థానం సాధించింది. రసాయన శాస్త్రంలోని 118 మూలకాల ఆవర్తన పట్టికను 1.43 నిమిషాల్లో అమర్చి రికార్డు నెలకొల్పింది. గతంలో పాకిస్తాన్‌కు చెందిన చిన్నారి 2.27 నిమిషాల్లో ఈ ఘనత సాధించగా, దానిని ఫజీలా తబస్సుమ్ బ్రేక్ చేసింది. చిలకలూరి పేటలోని సుభానీనగర్‌కు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు షేక్ రహీమ్ కుమార్తె షేక్  తన తండ్రి పాఠశాలలోనే ఐదో తరగతి చదువుతోంది.

కాగా, గతంలో ఫజీలా 118 మూలకాలను ఒక నిమిషం 57 సెకన్లలోనే అమర్చి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో పేరు సాధించింది. ఈ ఏడాది జనవరిలో గణపవరం సీఆర్ కళాశాలలో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు అఫీషియల్ అటెమ్ నిర్వహించగా 1.43 నిమిషాల్లో ఈవెంట్ ను పూర్తి చేసింది. ఏప్రిల్ 27న గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ నుంచి అధికారికంగా సమాచారం, సర్టిఫికెట్ అందుకుంది. ప్రస్తుతం 1.30 నిమిషాల్లోనే ఆవర్తన ప్రక్రియ అమర్చి తన రికార్డును తానే బ్రేక్ చేసేందుకు ప్రయత్నిస్తోంది.

DETAILS IN OFFICIAL WEBSITE

BBC Coverage on Fazeela

Previous
Next Post »
0 Komentar

Google Tags