Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Mother’s Day: History and Importance, Why Do We Celebrate

 


Mother’s Day: History and Importance, Why Do We Celebrate

నేడు ప్రపంచ మాతృదినోత్సవం - చరిత్ర మరియు ప్రాముఖ్యత – వివరాలు ఇవే

======================

ఏటా మే రెండో ఆదివారం ప్రపంచ మాతృదినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. దీనికి సుదీర్ఘ చరిత్ర, ఓ నేపథ్యం ఉంది. గ్రీస్‌లో ‘రియా’ అనే దేవతను ‘మదర్‌ ఆఫ్‌ గాడ్స్‌’గా భావించి ఏడాదికోసారి నివాళి అర్పించేవారు. 17వ శతాబ్దంలో ఇంగ్లాండ్‌లో తల్లులకు గౌరవంగా ‘మదరింగ్‌ సండే’ పేరిట ఉత్సవాన్ని జరిపేవారు. ‘జూలియవర్డ్‌ హోవే’ అనే మహిళ అమెరికాలో 1872లో తొలిసారిగా ప్రపంచ శాంతికోసం మదర్స్‌డే నిర్వహించాలని ప్రతిపాదించింది. అన్న మేరీ జర్విస్‌ అనే మహిళ ‘మదర్స్‌ ఫ్రెండ్‌షిప్‌ డే’ జరిపించేందుకు ఎంతో కృషిచేసింది. 

ఆమె 1905 మే 9న మృతిచెందగా, ఆమె కుమార్తె మిస్‌ జెర్విస్‌ మాతృదినోత్సవం కోసం విస్తృతంగా ప్రచారం చేసింది. ఇలా 1911 నాటికి అమెరికాలోని అన్ని రాష్ట్రాల్లో మాతృదినోత్సవం జరుపడం మొదలైంది. ఫలితంగా 1914నుంచి దీన్ని అధికారికంగా నిర్వహించాలని అమెరికా అధ్యక్షుడు ఉడ్రో విల్సన్‌ నిర్ణయించారు. కాలక్రమేణా ప్రపంచమంతా వ్యాపించింది. అప్పటినుంచి ఏటా మే రెండో ఆదివారం మాతృదినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అమ్మ గురించి ఎంత చెప్పినా ఇంకా మిగిలిపోతూనే ఉంటుంది ఆమె ప్రేమలా. ఎప్పుడూ మన గురించే ఆలోచన, మనమీదే ధ్యాస. అందుకే అమ్మ ఓ గొప్ప స్నేహితురాలు. అమ్మ కంటికి మనం చాలా అందంగా కనిపిస్తాం. అందుకే అమ్మ ఓ ఐ స్పెషలిస్ట్. నడకే కాదు నాగరికతనూ నేర్పిస్తుంది అమ్మ.. అంతులేని ప్రేమానుగారాలకు, ఆప్యాయతకు మారుపేరైన తల్లి ఎవరికైనా ప్రత్యక్ష దైవమే. కనిపించే దైవం అమ్మ. ఆత్మీయతకు, అనురాగానికి, త్యాగానికి చిరునామా అమ్మ.. ఆ పిలుపులోనే తీయదనం ఉంది. 

ప్రపంచంలో అతి పేదవాడు ధనం లేని వాడు కాదు అమ్మ లేనివాడు. అమ్మ ప్రేమ దక్కినవాడు అత్యంత కోటీశ్వరుడు. బిడ్డను ప్రేమగా చూసే ప్రతి తల్లి ‘మదర్ థెరిసా’యే. నడకే కాదు నాగరికతనూ నేర్పిస్తుంది అమ్మ.. అంతులేని ప్రేమానుగారాలకు, ఆప్యాయతకు మారుపేరైన తల్లి ఎవరికైనా ప్రత్యక్ష దైవమే. ఆప్యాయంగా అమ్మ కళ్లలోకి ఒక్కసారి చూస్తే సమస్త లోకాలు కనిపిస్తాయి. మనకు జన్మనివ్వడమే కాకుండా సమాజ నిర్మాణానికి దోహదకారి అయిన అమ్మను గౌరవించడం ప్రతి ఒక్కరి కర్తవ్యం.

======================

తప్పక చూడాల్సిన తెలుగు సినిమాలు ఇవే 👇👇👇

Previous
Next Post »
0 Komentar

Google Tags