దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ వివరాలు వెల్లడించిన కేంద్రం - వయసు వారీగా గణాంకాలు ఇవే
దేశంలోని 10 రాష్ట్రాల్లో 67శాతం మందికి టీకాలు ఇచ్చినట్టు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌కు సంబంధించిన గణాంకాలను వెలువరించింది. 60ఏళ్లు పైబడిన వారిలో 39.9శాతం మందికి టీకాలు ఇచ్చినట్టు తెలిపింది. 45 నుంచి 60 ఏళ్ల మధ్య వయసువారిలో 45.5శాతం మందికి; 30 నుంచి 45 ఏళ్ల వారిలో 9.4శాతం; 18 నుంచి 30 ఏళ్ల మధ్య వయస్కుల్లో 5.2శాతం మందికి టీకాలు ఇచ్చినట్టు పేర్కొంది.
18 నుంచి 44 ఏళ్ల వారిలో 42లక్షల మందికి పైగా టీకాలు వేసినట్టు తెలిపింది. ఇందులో అత్యధికంగా దిల్లీలో 5.26లక్షల మందికి టీకాలు ఇచ్చినట్టు వెల్లడించింది. ఇకపోతే, ఏపీలో 18 నుంచి 44 వారిలో 2624మందికి టీకాలు ఇవ్వగా, తెలంగాణలో ఆ సంఖ్య 500గా ఉన్నట్టు తెలిపింది.
HCW – Healthcare Workers
FCW – Frontline Workers
0 Komentar