Internet Explorer Set
to Retire Next Year, Says Microsoft
ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్: నిలిచిపోనున్న
IE సేవలు – ప్రకటించిన మైక్రోసాప్ట్
2022 జూన్ 15 నుంచి నిలిపివేత
సుమారు పాతికేళ్లుగా నెటిజన్లకు
సేవలందిస్తున్న ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ బ్రౌజర్‌ను 2022 జూన్ 15 నుంచి నిలిపివేయనున్నట్లు మైక్రోసాఫ్ట్
వెల్లడించింది. ఈ వెబ్ బ్రౌజర్‌ను విండోస్ 95తో కంపెనీ
విడుదల చేసింది. ‘ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ 11 డెస్క్‌టాప్
అప్లికేషన్‌కు వీడ్కోలు చెప్పబోతున్నాం. విండోస్ 10కి
చెందిన కొన్ని వెర్షన్లలో 2022 జూన్ 15 నుంచి దీని సేవలు అందుబాటులో ఉండవ’ని మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ ప్రోగ్రామ్
మేనేజర్ సియాన్ లిండర్‌సే తెలిపారు.
‘విండోస్ 10లో
ఇక ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్‌కు సంబంధించిదంతా మైక్రోసాఫ్ట్ ఎడ్జ్‌లో చూస్తాం.
మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ వేగవంతమైనదే కాదు.. మరింత సురక్షితమైనది. ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్‌కు
మించి వినూత్న బ్రౌజింగ్ అనుభూతిని అందిస్తుంద’ని సియాన్ వెల్లడించారు.
మైక్రోసాఫ్ట్ ఎడ్జ్‌లో ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ మోడ్ ఉంటుంది. దీనిసాయంతో
ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ ఆధారిత వెబ్‌సైట్స్, అప్లికేషన్లకు
యాక్సెస్ అవ్వొచ్చని తెలిపారు.
0 Komentar