JEE Main Exam 2021 for May Session Postponed: Education Minister
జేఈఈ మెయిన్ (మే సెషన్) పరీక్షలు వాయిదా
దేశంలో కరోనా ఉద్ధృతి దృష్ట్యా జేఈఈ మెయిన్ (మే సెషన్) పరీక్షలు కూడా వాయిదా పడ్డాయి. విద్యార్థుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని ఈ పరీక్షలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) వాయిదా వేసినట్టు కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ వెల్లడించారు. మే 24 నుంచి 28వరకు మే సెషన్ జేఈఈ మెయిన్స్ పరీక్షలు జరగాల్సి ఉంది. తదుపరి అప్‌డేట్స్ కోసం ఎన్‌టీఏ వెబ్‌సైట్‌ను సందర్శించాలని విద్యార్థులకు పోఖ్రియాల్ విజ్ఞప్తి చేశారు.
విద్యార్థుల సౌకర్యార్థం ఈ ఏడాది
నాలుగు విడతల్లో జేఈఈ మెయిన్స్‌నిర్వహించేందుకు ఎన్‌టీఏ షెడ్యూల్ ఖరారు చేసిన
విషయం తెలిసిందే. ఇప్పటికే రెండు విడతలు ఫిబ్రవరి (23 నుంచి 26 వరకు); మార్చి 16 నుంచి 18 తేదీల్లో పరీక్షలు పూర్తయ్యాయి.
మూడో విడత పరీక్షలు ఏప్రిల్ 27 నుంచి 30 వరకు జరగాల్సి ఉన్నప్పటికీ కొవిడ్ ఉద్ధృతి వేళ వాటినీ ఇటీవల వాయిదా
పడ్డాయి. దీంతో ఏప్రిల్, మే సెషన్లకు సంబంధించిన పరీక్ష
తేదీలను రీషెడ్యూల్ చేయనున్నారు. తొలి విడత పరీక్షలను 6,20,978 మంది విద్యార్థులు రాయగా, రెండో సెషన్ పరీక్షలను 5,56,248మంది విద్యార్థులు రాసినట్టు ఎన్‌టీఏ తెలిపింది. మరోవైపు, ఎన్‌టీఏ అభ్యాస్ యాప్ ద్వారా ఈ పరీక్షలకు విద్యార్థులు ప్రిపేర్
కావొచ్చని సూచించింది.
0 Komentar