కరోనా ఎఫెక్ట్:
కర్ణాటకలో 15 రోజుల పాటు పూర్తిస్థాయి లాక్ డౌన్
కరోనా కేసులు అదుపులోకి రాకపోవడంతో
కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొన్ని రోజుల పాటు పూర్తిస్థాయి లాక్‌డౌన్
విధిస్తున్నట్లు ప్రకటించింది.
* ఈ నెల 10వ
తేదీ నుంచి 24వ తేదీ వరకు లాక్‌డౌన్ అమల్లో ఉంటుందని
ముఖ్యమంత్రి యడియూరప్ప స్పష్టంచేశారు.
* కరోనా కట్టడికి విధించిన కర్ఫ్యూ
సత్ఫలితాలనివ్వకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
* లాక్‌డౌన్ సమయంలో అన్ని హోటళ్లు, పబ్బులు, బార్లు మూసివేయాలని యడియూరప్ప ఆదేశించారు.
* నిత్యావసర, కూరగాయల దుకాణాలు మాత్రం ఉదయం 6 నుంచి 10 గంటల వరకు తెరుచుకోవచ్చని తెలిపారు.
* లాక్‌డౌన్ సమయంలో ఉదయం 10 గంటల తర్వాత ఒక్కరిని కూడా అనుమతించేది లేదని స్పష్టంచేశారు.
* అయితే, ఇది తాత్కాలిక లాక్‌డౌన్ మాత్రమేనని, వలస కార్మికులెవరూ స్వస్థలాలకు వెళ్లొద్దని విజ్ఞప్తి చేశారు.
0 Komentar