Lunar eclipse, Supermoon and Blood Moon:
All coming together on May 26
రేపు (మే26న) ఈ ఏడాది తొలి
చంద్రగ్రహణం - చంద్రుడు సూపర్ బ్లడ్ మూన్‌గా కనువిందు
ఈ ఏడాది తొలి చంద్రగ్రహణం మే 26న (రేపు) ఏర్పడనుంది. ఇది సంపూర్ణ చంద్రగ్రహణం కాగా.. చంద్రుడు సూపర్ బ్లడ్ మూన్‌గా కనువిందుచేయనున్నాడు. గ్రహణ సమయంలో సూర్యుడు, చంద్రుడు, భూమి ఒకే సరళరేఖపై వస్తాయి. సూర్యుడు, చంద్రుడికి మధ్యకు భూమి వచ్చి భూమి నీడ చంద్రునిపై పడటాన్ని చంద్రగ్రహణం అంటారు. భూమి నీడపడినప్పుడు కాంతి తరంగాలు ఫిల్టర్ అవుతాయి. దీంతో చంద్రుడు ఎరుపు, నారింజ, గోధుమ రంగుల్లో కనిపిస్తాడు. చంద్రగ్రహణం సమయంలో మే 26న సాయంత్రం అరుదైన సూపర్ బ్లడ్ మూన్ ఆవిష్కృతం కానుంది.
సంపూర్ణ చంద్ర గ్రహణం అనంతరం ఇది సంభవిస్తుందని ఖగోళ శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ గ్రహణం భారత్‌లో మధ్యాహ్నం 3.15 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6.22 గంటలకు ముగుస్తుంది. సంపూర్ణ గ్రహణం 14 నిమిషాల 30 సెకన్ల పాటు ఉంటుంది. కోల్‌కతాలో ఇలాంటి చంద్ర గ్రహణాన్ని దాదాపు పదేళ్ల కిందట 2011 డిసెంబరు 10న కనువిందుచేసినట్టు ఎంపీ బిర్లా ప్లానిటోరియం డైరెక్టర్, ప్రసిద్ధ ఖగోళ భౌతిక శాస్త్రవేత్త దేబీ ప్రసాద్ దౌరీ తెలిపారు. ఈ చంద్ర గ్రహణం ఈశాన్య ఆసియా, పసిఫిక్ సముద్రం, ఉత్తర, దక్షిణ అమెరికా ప్రాంతాలు, ఆస్ట్రేయాల్లో కనిపిస్తుందని తెలిపారు.
ఈశాన్య రాష్ట్రాలతో పాటు పశ్చిమ బంగాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఈ గ్రహాణం కనిపిస్తుంది. మొదటి చంద్ర గ్రహణం ఆస్ట్రేలియా, అమెరికా, ఆసియా , పసిఫిక్ మహాసముద్రం ప్రాంతాలతో పాటు పాక్షికంగా భారత్‌లో ఉంటుంది. అయితే ఆస్ట్రేలియాలో సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుండగా.. అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లోనూ దాదాపు 14 నిమిషాల పాటు సంపూర్ణంగా దర్శనమివ్వనుంది.
ఇక ఈ చంద్ర గ్రహణం పాక్షికంగా
దక్షిణ ,
తూర్పు ఆసియా, ఆస్ట్రేలియా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, పసిఫిక్, అట్లాంటిక్, హిందూ
మహాసముద్రం, అంటార్కిటికాలో ఏర్పడనుంది. నాసా ఎక్లిప్ పేజ్
ప్రకారం, గ్రహణం అమెరికా కాలమానం ప్రకారం ఉదయం 4:47:39 గంటలకు ప్రారంభమై 57
నిమిషాల తర్వాత 5.44 గంటలకు పాక్షికస్థాయికి చేరుతుంది.. 7:11:25 గంటలకు
పూర్తిస్థాయికి చేరుకుంటుంది. తర్వాత క్రమంగా గ్రహణం వీడుతూ 10:52:22 గంటలకు
పూర్తవుతుంది.
0 Komentar