No Mask: అమెరికాలో మాస్కుల
నిబంధన సడలింపు
అమెరికాలో వ్యాక్సినేషన్ ఊపందుకొనే కొద్దీ నిబంధనలు మరింత సడలిస్తున్నారు. తాజాగా అమెరికాలో కార్యాలయాల వంటి ఇన్‌డోర్ ప్రదేశాల్లో, బాహ్య ప్రదేశాల్లో మాస్కులను తొలగించేందుకు అవకాశం కల్పించారు. దీంతో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నేడు ఓవల్ ఆఫీస్‌లో రిపబ్లికన్ సభ్యులతో కలిసి మాస్కును తొలగించారు. కాకపోతే, రద్దీ ఉన్న బస్సులు, విమానాలు, ఆసుపత్రుల్లో మాత్రం మాస్కులు ధరించాల్సిందే. ఇప్పటికే టీకాలు తీసుకొన్న ప్రజలకు మాస్కులు ధరించడంలో మినహాయింపులు ఇవ్వాలని బైడెన్ సర్కారుపై ఒత్తిళ్లు వస్తున్నాయి. తాజా నిర్ణయంతో అమెరికా మెల్లగా కరోనా ముందు నాటి పరిస్థితులకు చేరుకుంటోంది. తాజాగా 12-15 ఏళ్ల పిల్లలకు ఫైజర్ తయారు చేసిన టీకా అనుమతులు పొందడంతో అమెరికా పెడరేషన్ ఆఫ్ టీచర్స్ లేబర్ యూనియన్ పాఠశాలలను మరోసారి తెరవాలని కోరుతోంది.
పూర్తిస్థాయిలో రెండు డోసులు వ్యాక్సిన్ తీసుకొన్న వారికి భౌతిక దూరం నిబంధనల్లో కూడా సీడీసీ మినహాయింపులను ఇచ్చింది. ఈ నేపథ్యంలో అమెరికా శ్వేతసౌధంలోని రోజ్‌గార్డెన్‌లో జరిగిన కార్యక్రమంలో ఉపాధ్యక్షురాలు కమలాహారిస్‌తో కలిసి అధ్యక్షుడు జోబైడెన్ పాల్గొన్నారు. ‘మేము బయటకు పోయి ఎవరినీ అరెస్టు చేయం. కాకపోతే వ్యాక్సిన్ తీసుకోని వారు మాస్కులు ధరించాలని కోరుతాము’ అని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.
ఇదే అంశంపై ట్వటర్‌లో ఆయన పోస్టు కూడా చేశారు. ‘చాలా సులువైన నిబంధన: టీకా తీసుకో.. లేదా అప్పటి వరకూ మాస్కు ధరించు. ఈ రెండింటిలో ఏదో ఒకటి ఎంపిక చేసుకో’’ అని పేర్కొన్నారు. ఇప్పటికే అమెరికాలో 35శాతం మంది టీకాలు తీసుకొన్నారు.
తాజాగా అమెరికాలో టీకాలు తీసుకొన్న
వారు ఇన్‌డోర్, అవుట్‌డోర్‌లో మాస్కులు తొలగించవచ్చు. కాకపోతే కొన్ని
రకాల వ్యాపారాలు నిర్వహించే వారు మాత్రం తప్పనిసరిగా మాస్కులు ధరించాలి. దీంతోపాటు
జైళ్లు, అనాథలు ఉండే ప్రదేశాల్లో మాస్కులు ధరించాల్సిన అవసరం
ఉంది. బైడెన్ సర్కారు జులై4 నాటికి
70శాతం మందికి పూర్తిగా టీకాలు ఇవ్వాలని లక్ష్యంగా పనిచేస్తోంది.
Folks, if you’re fully vaccinated — you no longer need to wear a mask.
— President Biden (@POTUS) May 13, 2021
If you’re not vaccinated yet — go to https://t.co/4MYpWqXVVo to find a shot, and mask up until you’re fully vaccinated. pic.twitter.com/qcyG2WyCG2
0 Komentar