TS: ఇంట్లో కూర్చునే పరీక్షలు రాయండి - విద్యార్థులకు జయశంకర్ వర్సిటీ అవకాశం
కరోనా వ్యాప్తి నేపథ్యంలో విద్యార్థులు ఇంట్లో కూర్చుని కాగితాలపై సాధారణ పద్ధతిలోనే పరీక్షలు రాసే కొత్త పద్ధతిని అమలు చేయాలని ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం కసరత్తు చేస్తోంది. వ్యవసాయ డిగ్రీ చదువుతున్న 1, 2, 3 సంవత్సరాల విద్యార్థులందరికీ వారి ఇళ్ల నుంచే పరీక్షలు రాసే అవకాశం కల్పించాలనేది ఈ విధానం. ఇందులో విద్యార్థి ఇంట్లో కూర్చుని పరీక్ష రాస్తూ, అతని స్మార్ట్‌ఫోన్‌లో ఉండే కెమెరాను ఆన్‌చేసి పరీక్ష జరుగుతున్నంతసేపూ వర్సిటీ వెబ్‌సైట్‌కు అనుసంధానం చేయాలి.
ఆన్‌లైన్ ద్వారా
విద్యార్థి రాసే పరీక్షను అతని సెల్‌ఫోన్ కెమెరా ద్వారానే వర్సిటీ
పర్యవేక్షిస్తుంది. పరీక్ష రాసిన తరవాత పత్రాలను వర్సిటీకి పంపితే సరిపోతుంది.
వాటిని దిద్ది విద్యార్థికి మార్కులు వేసి ఫలితాలను ప్రకటిస్తుంది. ఇంట్లో
కూర్చుని రాస్తున్నాం కదా అని ఎవరైనా కాపీ కొట్టడానికి ప్రయత్నిస్తే
పట్టుకోవడానికి అనేక ఏర్పాట్లు చేస్తున్నట్లు విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్
డాక్టర్ సుధీర్‌కుమార్ చెప్పారు. ఎప్పటి నుంచి ఈ పరీక్షలు
నిర్వహించేది త్వరలో విద్యార్థులకు సమాచారం ఇస్తామన్నారు.
ఐసీఏఆర్ కొత్త అవకాశం
దేశంలోని మొత్తం 73
వ్యవసాయ వర్సిటీల డిగ్రీ విద్యార్థులకు పరీక్షలు రాయడంలో వెసులుబాటు కల్పించాలని
‘భారత వ్యవసాయ పరిశోధన మండలి’(ఐసీఏఆర్) అన్ని వర్సిటీలకు తాజాగా ఆదేశాలిచ్చింది.
విద్యార్థి ఎక్కడ నివసిస్తుంటే అక్కడికి దగ్గరలో ఉన్న వ్యవసాయ కళాశాల లేదా వ్యవసాయ
వర్సిటీకి వెళ్లి పరీక్షలు రాసేందుకు అనుమతించాలని సూచించింది. దీన్ని సరళీకృతం
చేస్తూ విద్యార్థి ఇంట్లోనే కూర్చుని రాసే విధానాన్ని తెచ్చేందుకు వర్సిటీ కృషి
చేస్తోంది.
0 Komentar