Powergrid PGCIL Recruitment 2021 for
Diploma Trainees
పవర్ గ్రిడ్ లో డిప్లొమా
ట్రెయినీలు
భారత ప్రభుత్వరంగానికి చెందిన పవర్
గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, నార్తర్న్ రీజియన్
ట్రాన్స్ మిషన్ సిస్టం కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
డిప్లొమా ట్రెయినీ
మొత్తం ఖాళీలు: 35
సబ్జెక్టులు: ఎలక్ట్రికల్, సివిల్
1) డిప్లొమా ట్రెయినీ (ఎలక్ట్రికల్):
30
అర్హత: కనీసం 70% మార్కులతో
సంబంధిత సబ్జెక్టుల్లో మూడేళ్లు రెగ్యులర్ ఇంజినీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణత.
డిప్లొమా అర్హత లేకుండా బీఈ/ బీటెక్/ ఎంఈ/ ఎంటెక్ వంటి అర్హతలు ఉన్నా పరిగణనలోకి
తీసుకోరు.
వయసు: 15.06.2021 నాటికి 27 ఏళ్లు
మించకూడదు.
2) డిప్లొమా ట్రెయినీ (సివిల్): 05
అర్హత: కనీసం 70% మార్కులతో
సంబంధిత సబ్జెక్టుల్లో మూడేళ్లు రెగ్యులర్ ఇంజినీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణత.
డిప్లొమా అర్హత లేకుండా బీఈ/ బీటెక్/ ఎంఈ/ ఎంటెక్ వంటి అర్హతలు ఉన్నా పరిగణనలోకి
తీసుకోరు.
వయసు: 15.06.2021 నాటికి 27 ఏళ్లు
మించకూడదు.
ఎంపిక విధానం: రాత పరీక్ష/
కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆధారంగా మాత్రమే ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
పరీక్షా విధానం: ఈ పరీక్ష
ఆబ్జెక్టివ్ టైప్ పద్ధతిలో ఉంటుంది. దీన్ని రెండు భాగాలుగా విభజిస్తారు. ఇందులో
పార్ట్-1 120 ప్రశ్నలు టెక్నికల్ నాలెడ్జ్! ప్రొఫెషనల్ నాలెడ్జ్ నుంచి ఉంటాయి.
పార్ట్-2లో ఆప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది. దీనిలో 50 ప్రశ్నలు వొకాబులరీ, వర్బల్
కాంప్రహెన్షన్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్ ఎబిలిటీ, డేటా సఫిషియన్సీ అండ్ ఇంటర్
ప్రిటేషన్, న్యూమరికల్ ఎబిలిటీ విభాగాల నుంచి ఉంటాయి.
పరీక్షా సమయం 2 గంటలు ఉంటుంది. దీనికి నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ప్రతి తప్పు
సమాధానానికి పావు మార్కు కోత విధిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా
దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ
ప్రారంభం: 24.05.2021.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేది:
15.06.2021.
0 Komentar