Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TS: ఇంట‌ర్‌లో ప్ర‌వేశాల‌కు షెడ్యూల్ విడుద‌ల‌ - జూన్ 1 నుంచి ఆన్లైన్ పాఠాలు

 

TS: ఇంట‌ర్‌లో ప్ర‌వేశాల‌కు షెడ్యూల్ విడుద‌ల‌ - జూన్ 1 నుంచి ఆన్లైన్ పాఠాలు

రాష్ట్రంలో ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు జూన్ 1వ తేదీ నుంచి ఆన్లైన్ తరగతులు మొదలుకానున్నాయి. తొలి ఏడాది విద్యార్థులకు మొదటి విడత ప్రవేశాలను జూన్ 5వ తేదీ వరకు పూర్తి చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ఇంటర్ బోర్డు మంగళవారం ప్రవేశాల కాలపట్టికను విడుదల చేసింది. 

ప్రభుత్వ కళాశాలల విద్యార్థులకు దూరదర్శన్ ద్వారా టీవీ పాఠాలను ప్రసారం చేస్తారు. ప్రైవేట్ కళాశాలలు సొంతగా ఆన్లైన్ పాఠాలను అందించుకుంటాయి. అయితే ఎవరైనా టీవీ పాఠాలను వినియోగించుకోవచ్చు.


ముఖ్యాంశాలు

* పదో తరగతిలో గ్రేడ్ల ఆధారంగా ప్రవేశాలు కల్పించాలి. ఎలాంటి ప్రవేశ పరీక్ష జరపరాదు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని బోర్డు ప్రకటించింది.

* ఏ కళాశాలలో ప్రవేశం పొందాలన్నా విద్యార్థులు ఆధార్ సంఖ్యను ఇవ్వాల్సిందే.

* విద్యార్థులను ఆకర్షించేలా, ప్రలోభాలకు గురిచేసే విధంగా కళాశాలలు ప్రవేశాలపై ప్రకటనలు ఇవ్వరాదు.

                                                                                                       

షెడ్యూల్ మరియు వివరాలు

* మే 25 నుంచి జులై 5వ తేదీ వ‌ర‌కు ప్ర‌వేశాలకు అనుమ‌తి.

* జూన్ 1 నుంచి ఇంట‌ర్ ఫ‌స్టియ‌ర్ ఆన్‌లైన్ త‌ర‌గ‌తులు ప్రారంభం.

* ఇంట‌ర్నెట్ మార్కుల మెమోల ఆధారంగా ప్రాథ‌మిక‌ ప్ర‌వేశాలు చేసుకోవాల్సిందిగా ఇంట‌ర్‌బోర్డు సూచించింది. అనంత‌రం ఎస్ఎస్‌సీ పాస్ స‌ర్టిఫికేట్‌, టీసీ, స్ట‌డీ స‌ర్టిఫికెట్ల ఆధారంగా ప్ర‌వేశాల‌ను ధ్రువీక‌రించాల‌ని పేర్కొంది.

* ఇక‌, 10వ తరగతిలో వచ్చిన గ్రేడ్స్ ను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాల‌ని, ఎలాంటి అడ్మిషన్ టెస్ట్ లు నిర్వహించకూడ‌ద‌ని స్ప‌ష్టం చేసింది.

* అనుమతికి మించి విద్యార్థులను కూడా చేర్చుకోవ‌ద‌ని ఆదేశించింది.

* విద్యార్థుల అడ్మిష‌న్స్‌కు ఆధార్ కార్డ్ తప్పనిసరి.

మ‌రోవైపు, కళాశాలల అనుబంధ గుర్తింపు పూర్తి కాకముందే అడ్మిషన్స్ షెడ్యూల్ విడుదల చేసింది ఇంటర్ బోర్డ్. మే 24 తో కళాశాలల అనుబంధ గుర్తింపు దరఖాస్తు గ‌డువు ముగిసిపోగా, ఆ ద‌ర‌ఖాస్తులను ప‌రిశీలించాల్సి ఉంది. ఈలోగానే ప్ర‌వేశాల‌కు షెడ్యూల్ విడుద‌ల చేసింది. ఇక‌, అనుబంధ గుర్తింపు ఉన్న కళాశాలల్లో మాత్రమే చేరాలని చెబుతున్నారు ఇంట‌ర్‌బోర్డు అధికారులు.

Previous
Next Post »
0 Komentar

Google Tags