SBI Revision in Service Charges: New Rates
w.e.f. July 1
ఎస్‌బీఐ సేవా రుసుముల సవరణ: జూలై
1 నుంచి అమలులోకి
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) తన ఖాతాదారులకు ఏటీఎంలో నగదు ఉపసంహరణలకు, చెక్‌బుక్ బదిలీ సంబంధించి ఛార్జీలు విధించబోతుంది. ఈ కొత్త సేవా ఛార్జీలు జూలై 1, 2021 నుండి అమల్లోకి వస్తాయని ఎస్‌బీఐ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది.
* ఎస్‌బీఐ బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ (బీఎస్‌బీడీ) ఖాతాదారులకు సేవా ఛార్జీలను సవరించింది. ఈ కొత్త ఛార్జీలు ఏటీఎం ఉపసంహరణలు, చెక్‌బుక్ బదిలీ మరియు ఇతర ఆర్థికేతర లావాదేవీలకు వర్తిస్తాయని ఎస్‌బీఐ తన వెబ్‌సైట్‌లో తెలిపింది.
* ఎస్‌బీఐ శాఖలలో నగదు ఉపసంహరణః 4 ఉచిత నగదు ఉపసంహరణ లావాదేవీల వరకు పరిమితి ఉంటుంది. నాలుగుకు మించితే బ్యాంక్ ఛార్జీలను విధిస్తుంది. ఇందులో ఒక బ్రాంచ్‌లో జరిగే లావాదేవీలతో పాటు బ్యాంక్ ఏటీఎం ఉపసంహరణలు కలిపే ఉంటాయి. కొత్త ఛార్జ్ బ్రాంచ్ వద్ద / ఏటీఎం వద్ద నగదు ఉపసంహరణ లావాదేవీకి రూ. 15 మరియు జీఎస్‌టీ విధిస్తుంది.
* ఎస్‌బీఐ ఏటీఎంలలో నగదు ఉపసంహరణః 4 నగదు ఉపసంహరణ లావాదేవీల వరకు (ఏటీఎం మరియు బ్యాంక్ బ్రాంచ్‌తో సహా) ఉచితం. నాలుగుకు దాటిన లావాదేవీలకు ఛార్జీలు విధిస్తారు. అన్ని ఎస్‌బీఐ, నాన్-ఎస్‌బీఐ ఏటీఎంలలో పరిమితి మించిన లావాదేవీలకు సర్వీస్ ఛార్జ్ రూ. 15 మరియు జీఎస్‌టీ విధిస్తుంది.
* చెక్‌బుక్ ఛార్జీలుః ఎస్‌బీఐ `బీఎస్‌బీడి` ఖాతాదారులకు ఒక ఆర్థిక సంవత్సరంలో 10 చెక్‌లను ఉచితంగా అందిస్తుంది. తర్వాత అదనంగా 10 చెక్‌లున్న బుక్‌కి రూ. 40 + జీఎస్‌టీ విధిస్తుంది. 25 చెక్‌లున్న బుక్‌కి రూ. 75 + జీఎస్‌టీ వసూలు చేస్తుంది. అత్యవసరంగా చెక్‌బుక్ కావాలిస్తే 10 చెక్‌లు ఉన్న బుక్‌కి రూ. 50 + జీఎస్‌టీ వసూలు చేస్తుంది. అయితే సీనియర్ సిటిజన్లకు చెక్‌బుక్‌లో కొత్త సర్వీస్ ఛార్జీ నుండి మినహాయింపు ఉంది.
* `బీఎస్‌బీడీ` ఖాతాదారులకు ఎస్‌బీఐ మరియు ఎస్‌బీఐయేతర బ్యాంక్ శాఖలలో ఆర్థికేతర లావాదేవీలపై ఎటువంటి ఛార్జీలు ఉండవు. వీరికి బ్రాంచ్‌లో నగదు బదిలీ లావాదేవీలు ఉచితం. ఎస్‌బీఐ `బీఎస్‌బీడీ` ఖాతా అంటే సున్నా బ్యాలెన్స్ పొదుపు ఖాతాగా ప్రసిద్ది చెందిన ఎస్‌బీఐ బీఎస్‌బీడీ ఖాతా ప్రధానంగా సమాజంలోని పేద వర్గాలకు ఉద్దేశించినది. ఛార్జీలు, ఫీజుల భారం లేకుండ పొదుపు ప్రారంభించమని వారిని ప్రోత్సహించడానికి సాధారణ పొదుపు బ్యాంకు ఖాతాల మాదిరిగానే సున్నా బ్యాలెన్స్ ఖాతాలపై బ్యాంక్ అదే వడ్డీ రేటును అందిస్తుంది.
* ఎస్‌బీఐ జీరో
బ్యాలెన్స్ సేవింగ్స్ ఖాతా కోసం, బేసిక్ రుపే ఏటీఎం-కమ్-డెబిట్
కార్డు ఉచితంగా ఇవ్వబడుతుంది. ఈ ఖాతాలకు వార్షిక నిర్వహణ ఛార్జీ వర్తించదు.
పనిచేయని ఖాతాలను సక్రమం చేయడానికి బ్యాంక్ ఎటువంటి ఛార్జీ విధించదు. ఖాతా
మూసివేత ఛార్జీలు కూడా విధించబడవు.
0 Komentar