SBI Customers' ALERT: Those Services to
remain affected on These dates and Timings
SBI ఖాతాదారులకు అలెర్ట్ – ఆ
సేవలకు ఈ మూడు రోజుల్లో అంతరాయం
ప్రభుత్వ రంగ బ్యాంక్ ఎస్‌బిఐ
డిజిటల్ సేవలకు అంతరాయం కలగనుంది. బ్యాంకుకు సంబంధించి నిర్వహణ పనుల నేపథ్యంలో
బ్యాంకు డిజిటల్ చెల్లింపుల వేదికలైన ఇంటర్నెట్ బ్యాంకింగ్, యోనో,
యూపీఐ తదితర సేవలు 3 రోజుల పాటు పరిమిత సయమంలో నిలిచిపోనున్నాయి.
ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించడంలో ఆయా సేవల్లో శుక్రవారం నుంచి ఆదివారం మధ్య
అప్ గ్రేడేషన్ ప్రక్రియ చేపడుతోంది.
దీంతో శుక్రవారం రాత్రి 10 గంటల 45
నిమిషాల నుంచి రెండున్నర గంటల పాటు, ఆదివారం తెల్లవారుజామున 2
గంటల 40 నిమిషాల నుంచి 06 గంటల 10 నిమిషాల వరకు డిజిటల్ సేవల్లో అంతరాయం
ఏర్పడుతుందని బ్యాంకు తెలిపింది. తమకు సహకరించాలని ఖాతాదారులకు విజ్ఞప్తి చేసింది.
We request our esteemed customers to bear with us as we strive to provide a better banking experience.#SBI #StateBankOfIndia #ImportantNotice #InternetBanking #OnlineSBI pic.twitter.com/LNMnKjORMR
— State Bank of India (@TheOfficialSBI) May 20, 2021
0 Komentar