‘శుద్ధీకరణ్’ పేరిట మూడు
డిజైన్ల తయారు చేసిన ఐఐటీ విద్యార్థుల ప్రయత్నం – వీటితో 3 నిమిషాల్లో వైరస్
రహితం
ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా కరోనా
వైరస్ బారిన పడే ప్రమాదముంది. బయటి నుంచి తెచ్చే వస్తువులు, వాడే
పాత్రలు ఇలా అన్నింటినీ శుద్ధి చేసుకోవాల్సిన పరిస్థితి. నిత్యం పరిశోధనల్లో
మునిగే ఐఐటీ హైదరాబాద్ విద్యార్థులు కరోనా విస్తరిస్తున్న వేళ ‘శుద్ధీకరణ్’
పేరిట మూడు డిజైన్లను తయారు చేశారు. తమ క్యాంపస్‌లో వాడుకునేలా వీటిని
రూపొందించారు. మల్టీ క్యాబినెట్ పరికరాన్ని కొద్దిరోజుల క్రితమే ప్రధాన
ప్రవేశమార్గం వద్ద ఏర్పాటు చేశారు.
బయటి నుంచి లోపలికి వచ్చే
వ్యక్తులు తీసుకొచ్చే వస్తువులను ఇక్కడ వైరస్ రహితంగా మార్చుతున్నారు. సింగిల్
యూనిట్,
శుద్ధీకరణ్-యూటీ అనే రెండింటిని ఇటీవల అందుబాటులోకి తెచ్చారు.
బిస్కట్, పాల ప్యాకెట్లు, ప్యాకింగ్
చేసిన ఇతరత్రా తినే పదార్థాలను దీని సాయంతో శుద్ధి చేస్తున్నారు. శుద్ధీకరణ్
యూటీని క్యాంపస్ ప్రాంగణంలో ఉన్న భోజనశాలలో ఉంచారు. ఇందులో కంచాలను ఉంచితే మూడు
నిమిషాల్లో అవి వైరస్ రహితంగా మారుతాయి. ఇలా గంటలో 1,200
కంచాలను శుద్ధి చేయవచ్చని వీటి తయారీలో కీలకంగా ఉన్న పరిశోధక విద్యార్థి ప్రియబ్రత
రౌత్రే వివరించారు.
అల్ట్రావయొలెట్ (యూవీ) కాంతిని
వాడుతూ వస్తువులు, కంచాలను క్రిమిరహితంగా మార్చవచ్చంటున్నారు.
ప్రయోగపూర్వకంగా వీటిని రూపొందించామని, వీటి ఉత్పత్తి
చేసేందుకు ఎవరైనా ముందుకొస్తే మార్కెట్లోకి అందుబాటులోకి తేవడం
సాధ్యమవుతుందంటున్నారు.
0 Komentar