SpaceX Capsule With 4 Astronauts
Splashes Down Off Florida: NASA
వ్యోమగాములను భూమికి తీసుకొచ్చిన
స్పేస్‌ఎక్స్ క్యాప్సుల్
వారం క్రితం నలుగురు వ్యోమగాములను
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి(ఐఎస్‌ఎస్) చేర్చిన స్పేస్‌ఎక్స్‌కు చెందిన
డ్రాగన్ క్యాప్సుల్...తిరుగు ప్రయాణంలో 167రోజులుగా ఐఎస్‌ఎస్‌లో
ఉన్న మరో నలుగురిని క్షేమంగా భూమి మీదకు తీసుకొచ్చింది. తిరిగి వచ్చిన వారిలో
ముగ్గురు అమెరికా వ్యోమగాములు, ఒక జపాన్ వ్యోమగామి ఉన్నారు.
డ్రాగన్ ఆరున్నర గంటల పాటు ప్రయాణించి ఆదివారం వేకువ జామున(స్థానిక కాలమానం
ప్రకారం) మెక్సికో గల్ఫ్‌లో పనామా సిటీకి సమీపంలో సముద్రంలో పడిపోయింది. ఆ సమయంలో
నాలుగు ప్యారాచూట్లు చక్కగా పనిచేశాయి. రాత్రి సమయంలో ఓ క్యాప్సుల్ సముద్రంలో
క్షేమంగా దిగడం 1968 తర్వాత ఇదే ప్రథమమని నాసా పేర్కొంది.
0 Komentar