Sputnik V (Imported) To Cost ₹ 995 Per
Shot, First Dose Administered
నేటి నుంచి స్పుత్నిక్-వీ భారత్
మార్కెట్‌లో అందుబాటులోకి – ధర ఖరారు
రష్యా అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్ స్పుత్నిక్-వీ భారత్ మార్కెట్‌లో అందుబాటులోకి వచ్చింది. శుక్రవారం నుంచి అందుబాటులోకి వచ్చినట్లు డాక్టర్ రెడ్డీస్ ప్రకటించింది. స్పుత్నిక్ వీ ఒక్కో డోసు ధర రూ.948గా నిర్ణయించింది. దీనికి 5శాతం జీఎస్‌టీ కలిపితే టీకా ధర డోసుకు రూ.995.40.
రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్టిమెంట్
సహకారంతో గమలేయా అభివృద్ధి చేసిన ఈ స్పుత్నిక్ వీ టీకా వినియోగానికి భారత
ప్రభుత్వం ఇప్పటికే అనుమతి ఇచ్చింది. ఇందులో భాగంగా రష్యా నుంచి కొన్ని డోసులు
హైదరాబాద్‌లోని డాక్టర్ రెడ్డీస్‌కు చేరాయి. వీటి పంపిణీకి సెంట్రల్ డ్రగ్స్
లాబోరేటరీ నుంచి మే 13న అనుమతి వచ్చిందని డాక్టర్ రెడ్డీస్
వెల్లడించింది. దీంతో తొలి డోసును నేడు(మే 14న)
ప్రారంభించామని హైదరాబాద్‌లోని ఆ సంస్థ తెలిపింది.
First doses of #SputnikV administered in India. On the picture Deepak Sapra, Global Head of Custom Pharma Services at @drreddys Laboratories is getting a shot of Sputnik V in Hyderabad. ✌️ pic.twitter.com/iBbTeB2DmT
— Sputnik V (@sputnikvaccine) May 14, 2021
0 Komentar