All Existing IFSC Codes Will Be
Cancelled for Syndicate Bank - Details Here
సిండికేట్ బ్యాంక్ ఐఎఫ్ఎస్‌సీ (IFSC) కోడ్‌లను అప్‌డేట్ చేసుకోండి - కెనరాబ్యాంక్
కెనరాబ్యాంక్‌లో విలీనమైన నేపథ్యంలో సిండికేట్ బ్యాంక్ సంబంధిత ఐఎఫ్ఎస్‌సీ కోడ్‌లు జులై 1,2021 నుంచి మారుతున్నాయని కెనరా బ్యాంక్ తమ వినియోగదారులకు తెలియజేసింది. అందువల్ల సిండికేట్ బ్యాంక్ కస్టమర్లు తమ పాత ఐఎఫ్ఎస్‌సీ కోడ్ వివరాలను జూన్ 30 తేది లోపుగా అప్‌డేట్ చేసుకోవాలని తెలిపింది.
గత సంవత్సరంలో సిండికేట్ బ్యాంకు, కెనరా బ్యాంకుతో విలీనం అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 'ఎస్‌వైఎన్‌బి'తో ప్రారంభమయ్యే అన్ని ఇ-సిండికేట్ ఐఎఫ్ఎస్‌సీ కోడ్‌లు మారాయి. 'ఎస్‌వైఎన్‌బి' (SYNB)తో ప్రారంభమయ్యే అన్ని ఐఎఫ్ఎస్‌సీ కోడ్‌లను జులై1,2021 నుంచి నిలిపివేయనున్నట్లు కెనరా బ్యాంక్ తెలిపింది.
నెఫ్ట్/ ఆర్‌టీజీఎస్/ఐఎమ్‌పీఎస్ ద్వారా డబ్బు పంపించేప్పుడు "సీఎన్ఆర్‌బీ"తో ప్రారంభమయ్యే కొత్త ఐఎఫ్ఎస్‌సీ కోడ్‌ను ఉపయోగించాలి. ఈ సమాచారాన్ని బ్యాంకు కస్టమర్లు తమకు డబ్బు పంపేవారికి తెలియజేయాలి అని బ్యాంక్ తన అధికారిక వెబ్‌సైట్‌లో పేర్కొంది.
ఐఎఫ్ఎస్‌సీ కోడ్ అంటే ఏమిటి?
ఐఎఫ్ఎస్‌సీ (ది ఇండియన్
ఫైనాన్షియల్ సిస్టమ్ కోడ్) అనేది ఒక ప్రత్యేకమైన 11-అంకెల
ఆల్ఫాన్యూమరిక్(ఆంగ్ల అక్షరాలు అంకెలతో మిళితమైన) కోడ్, ఇది
నెఫ్ట్, ఆర్‌టీజీఎస్, ఐఎమ్‌పీఎస్
ద్వారా జరిగే ఆన్‌లైన్ ఫండ్ బదిలీ లావాదేవీలకు ఉపయోగించబడుతుంది.
0 Komentar