Tamil Nadu Under Complete Lockdown from May 10 to May 24
కరోనా ఎఫెక్ట్: తమిళనాడు లో 14 రోజుల పాటు పూర్తిస్థాయి లాక్ డౌన్
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 10 నుంచి 24 వరకు పూర్తిస్థాయిలో లాక్‌డౌన్ విధిస్తున్నట్లు తెలిపింది. కరోనా తీవ్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. తమిళనాడు సీఎంగా స్టాలిన్ శుక్రవారం స్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కొవిడ్ కేసుల కట్టడికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. రెండు వారాల పాటు రాష్ట్రంలో పూర్తిస్థాయి కర్ఫ్యూ అమల్లో ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.
అనివార్య పరిస్థితుల కారణంగానే లాక్‌డౌన్ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని డీఎంకే ప్రభుత్వం పేర్కొంది. రాష్ట్రవ్యాప్తంగా 14 రోజుల పాటు సంపూర్ణ లాక్‌డౌన్ ఉంటుందని.. నిత్యావసరాలపై ఎలాంటి ఆంక్షలు లేవని వెల్లడించింది. మాంసం, కూరగాయల దుకాణాలు మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే తెరుచుకొని ఉంటాయని స్పష్టం చేసింది. లిక్కర్ దుకాణాలకు అనుమతి లేదని, రెస్టారెంట్లలో పార్శిల్ సదుపాయం మాత్రమే ఉంటుందని తెలిపింది. పెట్రోల్ బంక్‌లు తెరిచే ఉంటాయని పేర్కొంది.
కరోనా ఉద్ధృతి దృష్ట్యా ఇప్పటికే
పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఆయా రాష్ట్రాల్లో లాక్‌డౌన్లు విధించాయి. పలు
రాష్ట్రాల్లో రాత్రి కర్ఫ్యూ కొనసాగుతోంది. మరికొన్ని రాష్ట్రాలు లాక్‌డౌన్ దిశగా
అడుగులు వేస్తున్నాయి. తమిళనాడులో శుక్రవారం 26,465 కరోనా కేసులు
నమోదయ్యాయి. 197 మంది మృతిచెందారు.
0 Komentar