తెలంగాణలో రేపటి నుండి 10
రోజులు లాక్‌డౌన్
లాక్‌డౌన్‌పై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేపటి (12 వ
తేదీ) నుంచి 10 రోజుల పాటు లాక్‌డౌన్ విధించాలని కేబినెట్ నిర్ణయించింది. లాక్‌డౌన్
సమయంలో ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకే కార్యకలాపాలకు అవకాశమిచ్చారు.
రాష్ట్రంలో కరోనా తీవ్రత దృష్ట్యా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి 10రోజుల పాటు లాక్‌డౌన్ విధించాలని నిర్ణయించింది. ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో సమావేశమైన కేబినెట్.. ఈ మేరకు పలు నిర్ణయాలు తీసుకుంది. రేపటి (మే 12 నుంచి 22వ తేదీ వరకు) నుంచి 10 రోజుల పాటు లాక్‌డౌన్ అమల్లో ఉండనుంది. లాక్‌డౌన్ సమయంలో ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకే కార్యకలాపాలకు అవకాశమిచ్చారు. నిత్యావసరాలు, ఇతర వస్తువుల కొనుగోలుకు ఈ సమయంలో వెసులుబాటు కల్పించారు. ఆ తర్వాత దాదాపు అన్ని కార్యకలాపాలూ నిలిచిపోనున్నాయి. అత్యవసర సేవలను మాత్రమే అనుమతించనున్నారు. ప్రతిరోజూ 20 గంటలపాటు లాక్‌డౌన్ అమల్లో ఉండనుంది. లాక్‌డౌన్ సమయంలో నిబంధనలు కచ్చితంగా అమలయ్యేలా చర్యలు చేపట్టాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు.
మధ్యాహ్నం 2
గంటలకు ప్రారంభమైన కేబినెట్ భేటీలో పలు కీలక విషయాలపై మంత్రులతో సీఎం కేసీఆర్
మాట్లాడారు. లాక్‌డౌన్ విధిస్తే ఎదుర్కోవాల్సిన అంశాలు, ఇప్పటికే
విధించిన రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితులపై చర్చించారు. మరోవైపు
టీకా కొనుగోలుకు గ్లోబల్ టెండర్లను పిలవాలని మంత్రివర్గం నిర్ణయించింది.
0 Komentar