తెలంగాణ కేబినెట్ తీసుకున్న
నిర్ణయాలు - లాక్ డౌన్ నుంచి మినహాయింపు కల్పించిన రంగాలు
పది రోజుల పాటు లాక్‌డౌన్
విధిస్తూ తెలంగాణ సర్కారు నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. మే 12వ
తేదీ నుంచి 22 వరకూ ఈ లాక్‌డౌన్ అమల్లో ఉంటుంది. ఈ
నేపథ్యంలో మూడు గంటల పాటు జరిగిన కేబినెట్ భేటీలో లాక్‌డౌన్ సహా అనేక అంశాలపై
చర్చించి, మార్గదర్శకాలను విడుదల చేశారు.
తెలంగాణ కేబినెట్ తీసుకున్న
నిర్ణయాలు..
* మే 12వ తేదీ బుధవారం ఉదయం 10 గంటల నుంచి, 10 రోజులపాటు లాక్ డౌన్ అమలులో ఉంటుంది.
* ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు ప్రజల అవసరాల కోసం
సడలింపు.
* కేవలం 4 గంటలపాటు మాత్రమే అన్నిరకాల షాపులు తెరిచి ఉంటాయి. మిగతా 20 గంటలపాటు లాక్‌డౌన్.
*
మే 20న కేబినెట్ తిరిగి సమావేశం
అవుతుంది. లాక్‌డౌన్ కొనసాగించే విషయంపై సమీక్షించి తదుపరి నిర్ణయం తీసుకుంటారు.
* యుద్ధ
ప్రాతిపదికన వ్యాక్సిన్ ప్రొక్యూర్‌మెంట్ కోసం గ్లోబల్ టెండర్లు.
*
ప్రభుత్వ రంగంతోపాటు, ప్రైవేట్ రంగంలో
కూడా రెమిడిసివిర్ ఇంజక్షన్లు, ఆక్సిజన్, ఇతర కరోనా మందులను అందుబాటులోకి తీసుకురావడం. వీటి కొరత రాకుండా చూడాలని
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆదేశాలు.
* అన్ని జిల్లాల్లో మంత్రుల
అధ్యక్షతన కలెక్టర్, డీఎంహెచ్ఓ, జిల్లా
కేంద్రంలోని దవాఖానా సూపరింటెండెంట్, డ్రగ్ ఇన్‌స్పెక్టర్లతో
కమిటీ వేయాలని నిర్ణయం.
* రోజూ ఆయా జిల్లాల
మంత్రులు వారి వారి జిల్లా కేంద్రాల్లో కరోనాపై సమీక్ష చేయాలని సీఎం కేసీఆర్
ఆదేశం.
కేబినెట్ సమావేశం సందర్భంగా
రెమిడిసివర్ ఇంజక్షన్ ఉత్పత్తిదారులతో ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ఫోన్‌లో
మాట్లాడారు. రాష్ట్రానికి తగినన్ని మందులను సరఫరా చేయాలని కోరారు. ఏ రోజుకారోజు
మందులు,
వ్యాక్సిన్లను వేగవంతంగా సమకూర్చి, సరఫరా
చేయడం కోసం మంత్రి కేటీఆర్ అధ్యక్షతన రాష్ట్రస్థాయి టాస్క్ ఫోర్స్ నియామకానికి
కేబినెట్ ఆమోదం తెలిపింది. పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, జీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీ వికాస్ రాజ్, పంచాయతీరాజ్
ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియా, సీఎంఓ నుండి సీఎం
కార్యదర్శి, కోవిడ్ ప్రత్యేకాధికారి రాజశేఖర్ రెడ్డి ఈ
టాస్క్ ఫోర్స్‌లో సభ్యులుగా ఉంటారు.
లాక్ డౌన్ నుంచి మినహాయింపు కల్పించిన రంగాలు
* వ్యవసాయ ఉత్పత్తికి
సంబంధించిన పనులు, అనుబంధ రంగాలు, వ్యవసాయ
యంత్రాల పనులు, రైస్ మిల్లుల నిర్వహణ, సంబంధిత
రవాణా, ఎఫ్.సి.ఐ.కి ధాన్యం పంపడం, ఫెర్టిలైజర్,
సీడ్ షాపులు, విత్తన తయారీ కర్మాగారాలు తదితర
అన్నిరకాల వ్యవసాయ రంగాలకు లాక్ డౌన్ వర్తించదు.
* తెలంగాణ రాష్ట్ర రైతుల
ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ధాన్యం కొనుగోళ్లను యథావిధిగా కొనసాగింపు.
* వైద్య రంగంలో
ఫార్మాస్యూటికల్ కంపెనీలు, వైద్య పరికరాల తయారీ కంపెనీలు,
మెడికల్ డిస్ట్రిబ్యూటర్లు, మెడికల్ షాపులు,
అన్నిరకాల వైద్య సేవలు, ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానాలు, వారి వారి ఉద్యోగులు, సిబ్బందికి ప్రత్యేక పాసులిచ్చి, వాహనాలకు అనుమతి.
*
గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో తాగునీటి
సరఫరా, పారిశుద్ధ్య నిర్వహణ యథావిధిగా కొనసాగింపు.
* విద్యుత్ ఉత్పత్తి,
పంపిణీ వ్యవస్థలు, వాటి అనుబంధ కార్యకలాపాలు
యథావిధిగా పనిచేస్తాయి.
* జాతీయ రహదారుల మీద రవాణా,
పెట్రోల్, డీజిల్ పంపులు నిరంతరం తెరిచే
ఉంటాయి.
* కోల్డ్ స్టోరేజీ, వేర్ హౌసింగ్ కార్యకలాపాలకు మినహాయింపు
* ప్రింట్ అండ్
ఎలక్ట్రానిక్ మీడియాకు మినహాయింపు
* ఉపాధిహామీ
పనులు యథావిధిగా కొనసాగుతాయి.
* ప్రభుత్వ కార్యాలయాలు 33శాతం సిబ్బందితో పనిచేస్తాయి.
* గత లాక్ డౌన్ సమయంలో
మాదిరిగానే బ్యాంకులు, ఏటీఎంలు యథావిధిగా పనిచేస్తాయి.
*
అన్ని ముందస్తు అనుమతులతో జరిపే పెళ్లిళ్లకు గరిష్టంగా 40 మందికి మాత్రమే అనుమతి
* అంత్యక్రియల సందర్భంలో
గరిష్టంగా 20 మందికి మాత్రమే అనుమతి.
* తెలంగాణ
చుట్టూ. రాష్ట్రాల సరిహద్దుల్లో చెక్ పోస్టుల ఏర్పాటుకు నిర్ణయం
* ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు అన్నిరకాల మెట్రో, ఆర్టీసీ ప్రజా రవాణా అందుబాటులో ఉంటుంది.
* ఉదయం
6 గంటల నుంచి 10 గంటల వరకు రేషన్
షాపులు తెరిచే ఉంటాయి.
* కుకింగ్ గ్యాస్ ఫిల్లింగ్
స్టేషన్ సరఫరా యథావిధిగా కొనసాగుతుంది.
* సినిమాహాళ్లు, క్లబ్బులు, జిమ్ లు, స్విమ్మింగ్
పూల్స్, అమ్యూజ్ మెంట్ పార్కులు, స్పోర్ట్స్
స్టేడియంలు మూసి వేయాలని కేబినెట్ నిర్ణయించింది.
0 Komentar