TS: ఇంటర్ ప్రాక్టికల్స్
వాయిదా - జులైలో ఇంటర్ పరీక్షలు?
ఇంటర్ ప్రాక్టికల్స్ వాయిదా
కరోనా పరిస్థితుల దృష్ట్యా ఇంటర్
ప్రాక్టికల్ పరీక్షలను తెలంగాణ ఇంటర్ బోర్డు వాయిదా వేసింది. ఈనెల 29
నుంచి జూన్ 7 వరకు ప్రాక్టికల్స్ జరగాల్సి ఉంది. అయితే కోవిడ్
కేసుల సంఖ్య ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రాక్టికల్ పరీక్షలు వాయిదా పడ్డాయి. జూన్
మొదటి వారంలో సమీక్షించి మళ్లీ నిర్ణయం తీసుకుంటామని ఇంటర్ బోర్డు కార్యదర్శి
జలీల్ తెలిపారు. ప్రాక్టికల్ పరీక్షలకు 15 రోజుల ముందు
షెడ్యూలు ప్రకటిస్తామని ఆయన చెప్పారు.
జులైలో ఇంటర్ పరీక్షలు?
తెలంగాణలో ఇంటర్ పరీక్షల
నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి తన అభిప్రాయాలను తెలిపింది. ఈ మేరకు
కేంద్ర విద్యాశాఖ సంయుక్త కార్యదర్శికి రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి లేఖ రాశారు.
కొవిడ్ కారణంగా నిలిచిపోయిన ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు జులై మధ్యలో
నిర్వహించే యోచనలో ఉన్నట్లు తెలిపారు. పరీక్ష సమయాన్ని మూడు గంటల నుంచి గంటన్నరకు
తగ్గించేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నామన్నారు. ప్రశ్నపత్రాలు ఇప్పటికే
సిద్ధమైనందున పరీక్షా విధానాన్ని మార్చలేమని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.
ప్రశ్నపత్రంలోని సగం ప్రశ్నలకే సమాధానాలు రాసేందుకు అవకాశం కల్పించే అంశాన్ని
పరిశీలిస్తున్నామని చెప్పింది. కరోనా కారణంగా పరీక్షకు హాజరుకాలేకపోయిన
విద్యార్థులకు మరోసారి నిర్వహిస్తామని, ఫలితాలను ఆగస్టు
నెలాఖరులో వెల్లడిస్తామని రాష్ట్ర విద్యాశాఖ కేంద్రానికి తెలిపింది.
0 Komentar