TS: అపోలో హాస్పిటల్లో రేపటి
నుంచే వ్యాక్సిన్
45ఏళ్లు దాటిన వారికి గురువారం నుంచి కరోనా వ్యాక్సిన్ అందించనున్నట్లు అపోలో ఆస్పత్రి ప్రకటించింది. తాజాగా వ్యాక్సినేషన్ ప్రక్రియకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం మార్గదర్శకాలను సవరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 45ఏళ్లు దాటిన వారికి ప్రభుత్వ నియమ, నిబంధనల ప్రకారం వ్యాక్సిన్ అందిస్తామని తెలిపింది. 45ఏళ్లు దాటిన వ్యక్తులు కొవిన్ పోర్టల్‌లో తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని సూచించింది. నేరుగా వచ్చే వారికి వ్యాక్సిన్ ఇవ్వబోమని తెలిపింది.
రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రైవేటు
ఆసుపత్రుల్లోనూ 45 ఏళ్లు పైబడినవారికి మొదటి, రెండో డోసు టీకాలు ఇవ్వడానికి అవసరమైన నిల్వలు కొనుగోలు చేసుకోవడానికి
రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. ఉత్పత్తి సంస్థల నుంచి నేరుగా కొనుగోలు
చేసుకోవచ్చని పేర్కొంది. కొవిన్ పోర్టల్‌లో ముందస్తుగా నమోదు చేసుకున్న 45 ఏళ్లు పైబడినవారికి మాత్రమే టీకాలందించాలని పేర్కొంటూ మార్గదర్శకాలను
సవరించింది.
0 Komentar