Weightage up to 15% for Contract/Outsourcing/Honorarium
staff who is doing COVID-19 duties
కోవిడ్ విధుల్లో పాల్గొన్న వారికి శాశ్వత
నియమకాల్లో ప్రాధాన్యం
తాత్కాలిక వైద్యులు, ఇతర
ఆరోగ్య సిబ్బందికి అవకాశం – ప్రభుత్వ ఉత్తర్వులు
కొవిడ్-19 విధుల్లో పాల్గొన్న తాత్కాలిక వైద్యులు, ఇతర ఆరోగ్య
సిబ్బందికి శాశ్వత ఉద్యోగ నియామకాల్లో 15% వరకు ప్రాధాన్య
(వెయిటేజ్) మార్కులు ఇవ్వనున్నారు. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి మే 08న ఉత్తర్వులు జారీ చేశారు. ఎంబీబీఎస్, ఇతర డిగ్రీ
కోర్సుల్లో అభ్యర్థులు సాధించిన మార్కులకు 75% ప్రాధాన్యమిస్తారు.
కొవిడ్ విధుల్లో ఆరు నెలలుగా పని చేస్తున్నట్లయితే 5 మార్కులు,
ఏడాది కాలానికి 10, ఏడాదిన్నర పని చేస్తే
గరిష్ఠంగా 15 మార్కులు కేటాయిస్తారు.
డిగ్రీ పూర్తి చేసిన సంవత్సరం
నుంచి ప్రతి ఏడాదికి ఒక మార్కు చొప్పున (గరిష్టంగా పదేళ్లకు మించకుండా)
కేటాయించనున్నామని వివరించారు. అదే విధంగా ఇప్పటికే ప్రభుత్వం తరఫున గిరిజన, గ్రామీణ,
పట్టణ ప్రాంతాల్లో పని చేస్తున్నవారికి తగిన ప్రాధాన్యం ఇస్తామని
ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ ప్రాధాన్య మార్కులు ప్రజారోగ్యశాఖ, వైద్య విధాన పరిషత్, వైద్య విద్య సంచాలక శాఖ చేపట్టే
శాశ్వత నియామకాలకు వర్తిస్తాయి. జిల్లా కలెక్టర్ నియమించిన ప్రకారం కొవిడ్
విధుల్లో పాల్గొన్న వారికే ఈ మార్కులు కేటాయిస్తారు.
HM&FW Department – Comprehensive
guidelines for awarding Weightage upto 15% for the persons of Contract
/Outsourcing/Honorarium staff who rendered their services at Tribal/Rural/Urban
Areas and also during pandemic COVID-19 duties – Orders –Issued.
G.O.RT.No. 211 Dated: 08-05-2021.
0 Komentar