WhatsApp Scraps May 15 Deadline for
Accepting Privacy Policy Terms
వాట్సాప్ వినియోగదారులకు ఊరట - ప్రైవసీ
పాలసీ గురించి స్పష్టత ఇచ్చిన వాట్సాప్
వాట్సాప్ వినియోగదారులకు ఊరట.
* గడువు ముగిసినప్పటికీ నూతన ప్రైవసీ పాలసీని అంగీకరించకపోయిన వారి ఖాతాలు డిలీట్ చేయబోమని వాట్సాప్ స్పష్టంచేసింది.
* ఇందుకోసం విధించిన మే 15
డెడ్‌లైన్ విషయంలో వెనక్కి తగ్గింది.
* ఆ గడువు దాటినప్పటికీ నూతన ప్రైవసీ పాలసీని అంగీకరించకపోయిన ఖాతాలు కొనసాగుతాయని వాట్సాప్ ప్రతినిధి ఒకరు తెలిపారు.
* అలాగే, ప్రైవసీ
పాలసీని ఆమోదించాలన్న రిమైండర్లను మరికొన్ని వారాల పాటు యూజర్లకు పంపిస్తామని
వాట్సాప్ ప్రతినిధి చెప్పారు.
* ఇప్పటి వరకూ అలా సందేశాలు వచ్చిన
వారిలో చాలా మంది ప్రైవసీ పాలసీని ఆమోదించారని తెలిపారు.
* అయితే, ఎంత మంది నూతన పాలసీని ఆమోదించారనే అంశంపై స్పష్టతనివ్వలేదు.
* అలాగే, వాట్సాప్ తాజా నిర్ణయం వెనుక అసలు కారణం మాత్రం తెలియరాలేదు.
0 Komentar