10-Storey Building Constructed in 28
Hours in China
28 గంటల్లో 10 అంతస్తుల భవన నిర్మాణం!
చైనాకు చెందిన ప్రముఖ భవన నిర్మాణ
సంస్థ ‘బ్రాడ్ గ్రూప్’ చాంగ్షా నగరంలో కేవలం 28 గంటల 45 నిమిషాల్లో పదంతస్తుల భవనాన్ని చకచకా కట్టేసి అందర్నీ అబ్బురపరిచింది. ఈ
నిర్మాణానికి సంబంధించిన అయిదు నిమిషాల నిడివిగల వీడియోను తన యూట్యూబ్ ఛానెల్‌లో
ఈ నెల 13న పెట్టింది. నిర్మాణాన్ని మొదలుపెట్టినప్పటి నుంచీ
పూర్తి అయ్యేవరకు వారు చేసిన పనులు తెలిపేలా ఈ వీడియో రూపొందించారు.
‘అతి తక్కువ సమయంలో భవన నిర్మాణం
చేయాలని అనుకున్నాం. దీని కోసం గతంలో నిర్మించిన ఇళ్ల తాలూకు విధానాలను చూశాం.
తగినట్లుగా ప్రణాళిక రచించుకున్నాం. అవసరమైన కార్మికశక్తిని ముందే సిద్ధం
చేసుకున్నాం. అనుకూల వాతావరణం చూసుకొని నిర్మాణం ప్రారంభించాం.
సాధారణంగా ఓ భవన నిర్మాణానికి
కనీసం కొన్ని వారాలు పడుతుంది. మా ప్రణాళికతో అతి తక్కువ సమయంలోనే ఈ ఘనత సాధించాం’
అని బ్రాడ్ గ్రూప్ ప్రతినిధి తెలిపారు. భవన నిర్మాణానికి కావాల్సిన స్లాబులు, మాడ్యూల్స్‌ను
సంస్థ ముందుగానే నిర్మించి పెట్టుకుంది. మూడు భారీ క్రేన్ల సాయంతో
నిర్మాణస్థలానికి వాటిని తరలించింది. అనుకున్న విధంగా కార్మికులు వాటిని అమర్చారు.
అనంతరం ఒకదానితో ఒకటి కలిపి, కదలకుండా బోల్టులు గట్టిగా
బిగించారు. దీంతో అతి తక్కువ సమయంలో 10 అంతస్తుల భవనం
సిద్ధమైంది.
0 Komentar