ఆటోమేటిక్ అడ్వాన్స్ మెంట్ స్కీమ్
(AAS)
* ప్రమోషన్ అవకాశాలు లేక ఒకే పోస్టులో ఎక్కువ కాలం పని చేయుచున్న ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ఈ పథకం GO.Ms.No. 117 Fin.Plg, Dt. 25.05.1981 ద్వారా Dt. 01.04.1981నుండి ప్రవేశ పెట్టబడింది.
* ఉపాధ్యాయులకు రీగ్రూపింగ్ స్కెల్
ఆధారంగా ఈ పథకం తేది. 01.12.1982 నుండి అమలు చేయబడింది.
* వేతన సవరణ సంఘం సిఫార్సుల మేరకు ప్రతి
పీఆర్‌సీలో ఈ పథకానికి సంబంధించిన ప్రత్యేకంగా ప్రభుత్వ ఉత్తర్వులు జారీ
చేయబడుతుంటాయి.
* ప్రభుత్వ ఉద్యోగులకు విడుదల చేయబడే
ఉత్తర్వులు, వివరణలు ఉపాధ్యాయులకు కూడా యధావిధిగా వర్తింప
చేయబడుతుంటాయి.
* ఇవికాక ఉపాధ్యాయులకు సంబంధించి కొన్ని ప్రత్యేక రాయితీలు (Exemptions) కూడా సాధించుకొనుట జరిగింది.
* జిఓ. ఎంఎస్.నం. 96 ఆర్థిక తేది. 20.05.2011 ద్వారా నూతన ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీం 1.02.2010 నుండి అమలులోకి వచ్చింది. ఈ పథకంలో నాలుగు రకాల స్నేళ్ళు ఉంటాయి.
1.
Special Grade scale
2. SPP-IA/SAPP-IA Scale
3.
SPP-IB/SAPP-IB Scale
4.SPP-II/SAPP-II Scale.
🌾1. Special Grade Scale (SG):
ఉద్యోగి ఒక పోస్టులో 6
సం||ల ఇంక్రిమెంటల్ సర్వీసు పూర్తి చేస్తే వారికి ఈ
స్కేలుమంజూరు చేయబడుతుంది.ఈ స్కేలు మంజూరుకు ఎటువంటి అదనపు అర్హతలు అవసరం
లేదు.ఉద్యోగి పని చేయుచున్న పోస్టుకు సంబంధించిన స్కేలుకు తదుపరి స్కేలు ఎస్క్
స్కేల్ గా మంజూరు చేయబడుతుంది. వేతన నిర్ణయంFR22a(i) read with FR31(2) ప్రకారం జరుగుతుంది.
🌾2. A. Special Promotion Post Scale IA(SPP-IA):
ఉద్యోగి ఒకే పోస్టులో 12
సం॥ల ఇంక్రిమెంటల్ సర్వీసు పూర్తిచేసినచో వారికి తదుపరి ప్రమోషన్ పోస్టు స్కేలు SPP-IA
స్కేలుగా మంజూరు చేయబడుతుంది. ఈ స్కేలు పొందుటకు తదుపరిప్రమోషన్
పోస్టుకు పూర్తి అర్హతలుకలిగి యుండవలెను.మరియు ఆ పోస్టు సంబంధిత డిపార్ట్మెంట్ కు
చెందిన సర్వీసురూల్సు ప్రకారం రెగ్యులర్ ప్రమోషన్ ఛానల్ లో యుండవలెను.
ఉపాధ్యాయులకు ఈ స్కేలు పొందుటకు కొన్ని రాయితీలు యివ్వబడినవి. క్యాటగిరీ-2 ఉపాధ్యాయుడు 45 సం||లు
నిండితే మొదట ప్రమోషన్‌కు 50 సం||లు
నిండితే తదుపరి ప్రమోషన్లు పొందుటకు డిపార్ట్ మెంటల్ పరీక్షలు (EO,GO
Tests)నుండి మినహాయింపు కలదు. గ్రేడ్-1
పండితులు SOT పాస్ అయిన ఎడల ఈ స్కేలు వస్తుంది. మున్సిపల్,
ఎయిడెడ్ పాఠశాలల ఉపాధ్యాయులు 45 సం||లు నిండినఎడల హెచ్ఎం ఎకౌంట్ టెస్ట్ నుండి మినహాయింపు కలదు. కేటగిరీ-3 వారు పిఏటి పరీక్ష పాస్ అయినచో ఈ స్కేలుపొందుటకు అర్హులు. వేతన నిర్ణయం FR
22a(i) read with FR 31(2) ప్రకారం జరుగుతుంది.
🌾B. Special Adhoc Promotion Post IA(SAPP-IA):
సర్వీసు నిబంధనల ప్రకారం తదుపరి
ప్రమోషన్ ఛానల్ లేనివారికి 12 సం||ల
ఇంక్రిమెంటల్ సర్వీసు పూర్తి అయిన ఎడల ఈ స్కేలు మంజూరు చేయబడుతుంది. దీనికి
ప్రత్యేకమైన అర్హతలు ఏమీ పొందనవసరం లేదు. 6నం||ల ఎజ్ స్కేలుకు తదుపరి స్కేలు SAPP-IA స్కేలుగా
మంజూరు చేయబడుతుంది. వేతన నిర్ణయం FR 22a(i) read with FR 31(2) ప్రకారం జరుగుతుంది.
🌾3. A. Special Promotion Post Scale IB (SPP-IB):
ఒక ఉద్యోగి ఒకే పోస్టులో 18
సం||ల ఇంక్రిమెంట్ సర్వీసు పూర్తి చేసిన ఎడల ఈ స్కేలు మంజూరు
చేయబడుతుంది. సదరు ఉద్యోగికి SPP-IA స్కేలులోనే ఒక
ఇంక్రిమెంటు మంజూరు చేయబడుతుంది. ఉద్యోగి నార్మల్ ఇంక్రిమెంట్ తేదీకే తదుపరి
ఇంక్రిమెంటు మంజూరు చేయబడుతుంది. కొందరు ఉద్యోగులు 01.02.2010 నాటికి 24 సం||ల సర్వీసు
పూర్తి చేసి అర్హతలు లేని కారణంగా SPP-II స్కేలు పొందలేకపోయినట్లయితే
వారికి 18 సం||ల SPP-IB స్కేలు మంజూరు చేయబడుతుంది.
🌾B. Special Adhoc Promotion Post Scale 1B:
SAPP-I స్కేలు పొందుతూ 18 సం||ల ఇంక్రిమెంటల్ సర్వీసు పూర్తి చేసిన ఉద్యోగికి
అదే స్కేలులో ఒక ఇంక్రిమెంటు మంజూరు చేయబడుతుంది. దీనికి ఎటువంటి అదనపు అర్హతలు అవసరము
లేదు. నార్మల్ ఇంక్రిమెంటు తేదీ కొనసాగుతుంది.
🌾4. A. Special Promotion Post Scale II (SPP-I):
ఉద్యోగి ఒకే పోస్టులో 24
సం||ల ఇంక్రిమెంటల్ సర్వీసు పూర్తి చేసిన ఎడల రెండవ ప్రమోషన్
పోస్టు యొక్క స్కేలు SPP-II స్కేలుగా మంజూరు చేయబడుతుంది. ఈ
స్కేలు పొందుటకు రెండవ ప్రమోషన్ పోస్టు యొక్క అర్హతలు పూర్తిగా కలిగి యుండవలెను
మరియు ఆ పోస్టు సర్వీసు నిబంధనల ప్రకారంరెగ్యులర్ ప్రమోషన్ ఛానల్ లో యుండవలెన.
వేతన నిర్ణయం FR 22 a(i) read with FR 31 (2) ప్రకారం
జరుగుతుంది.
🌾B. Special Adhoe Promotion Post Scale II(SAPP-II):
ఉద్యోగి ఒకే పోస్టులో 24
సం||ల ఇంక్రిమెంటల్ సర్వీసు పూర్తిచేసిన సందర్భంలో సర్వీసు
నిబంధనల ప్రకారం రెండవ ప్రమోషన్ పోస్టు యొక్క ఛానల్ లేనప్పుడు ఈ స్కేలు మంజూరు చేయబడుతుంది.
దీనికి ప్రత్యేకంగా అర్హతలు పొందవలసినవసరం లేదు. ఉద్యోగి అప్పటికి పొందుచున్న
స్కేలుకు తదుపరిస్కేలు SAPP-II స్కేలుగా మంజూరు చేయబడుతుంది.
వేతన నిర్ణయం FR22 a(i) read with FR31 (2) ప్రకారం
జరుగుతుంది.
0 Komentar