ఏపి: పది, ఇంటర్
పరీక్షల పై విద్యాశాఖ మంత్రి ప్రకటన - జులైలో పరీక్షలు
కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండటంతో జులైలో పరీక్షలు నిర్వహించాలని ఏపీ విద్యాశాఖ భావిస్తోంది. వచ్చేనెల మొదటి వారంలో ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నట్టు ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ తెలిపారు. జులై చివరి వారంలో పదో తరగతి పరీక్షలు నిర్వహించే అవకాశముందన్నారు. సీఎం జగన్‌తో చర్చించి పరీక్షల ఏర్పాట్లపై తుది నిర్ణయం తీసుకుంటామని మంత్రి వెల్లడించారు. విద్యార్థుల ప్రయోజనం కోసమే పరీక్షలు నిర్వహణ అని తెలిపారు. 1998 డీఎస్సీ అభ్యర్థుల సమస్య పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నామని మంత్రి సురేశ్ వెల్లడించారు. 36 మందికి ఉద్యోగాలు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు.
ఇంటర్ పరీక్షలకు 10లక్షల మంది
ఇంటర్ పరీక్షలకు 10
లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరవుతారు. పరీక్షల నిర్వహణకు 15 రోజుల ముందు షెడ్యూలు ప్రకటించాలి. ఈ నెల 20 వరకూ
కర్ఫ్యూ ఉంది. ఆ తర్వాత వైద్యశాఖ అధికారుల సూచనలతో పరీక్షల సమయాన్ని ప్రకటించాలని
భావిస్తున్నారు. వచ్చే నెల ఇంటర్ పరీక్షలు పూర్తయితే ఆగస్టులో ఇంజినీరింగ్,
వ్యవసాయం, ఫార్మసీ, ఇతర
ఉమ్మడి పోటీ పరీక్షలు ఉంటాయి. సెప్టెంబరులో తరగతులు ప్రారంభించాలని ఉన్నత
విద్యాశాఖ భావిస్తోంది.
0 Komentar