AP పది, ఇంటర్ పరీక్షలు: పరిస్థితులు చక్కబడ్డాకే పరీక్షలు - రాష్ట్ర విద్యాశాఖ మంత్రి
ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితులు చక్కబడ్డాకే
పదో తరగతి, ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తామని రాష్ట్ర విద్యాశాఖ
మంత్రి ఆదిమూలపు సురేశ్ తెలిపారు.
★ మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకునే పరీక్షలు నిర్వహించాలని
భావిస్తున్నట్టు చెప్పారు.
★ ఇతర రాష్ట్రాలు పరీక్షలను రద్దు
చేస్తున్నాయని, అలాగని ఏపీలో కూడా పరీక్షలు రద్దు చేయాల్సిన
అవసరం ఏముందన్నారు.
★ అలాగైతే ఏపీలో అమలు చేస్తున్న సంక్షేమ
పథకాలను ఇతర రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారా? అని మంత్రి
ప్రశ్నించారు.
★ రాష్ట్రంలో కరోనా ఉద్దృతి నేపథ్యంలో పదో
తరగతి, ఇంటర్ పరీక్షలను రాష్ట్ర ప్రభుత్వం వాయిదా వేసిన
విషయం తెలిసిందే.
0 Komentar