కాంట్రాక్టు ఉద్యోగుల వేతనాలను
సవరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
రాష్ట్రంలోని కాంట్రాక్టు ఉద్యోగుల
వేతనాలను సవరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులనిచ్చింది. 2015 సవరించిన పే స్కేలు
ప్రకారం మినిమం టైంస్కేలు వర్తింపజేస్తూ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రావత్
శుక్రవారం రాత్రి ఆదేశాలనిచ్చారు. దీంతోపాటే కాంట్రాక్టు మహిళా ఉద్యోగులకు 180 రోజుల ప్రసూతి సెలవునిస్తారు. మొదటి ఇద్దరు పిల్లల వరకు ఇది
వర్తిస్తుంది. కాంట్రాక్టు ఉద్యోగులు ఎవరైనా ప్రమాదవశాత్తూ లేదా కొవిడ్‌వంటి
అనారోగ్యాలతో మరణిస్తే వారి కుటుంబీకులకు రూ.5 లక్షల
పరిహారమిస్తారు. సాధారణంగా మరణిస్తే రూ.2 లక్షల పరిహారం
అందించనున్నారు.
2003లో కాంట్రాక్టు వ్యవస్థ
ప్రారంభమైననాటి నుంచి వీరి వేతనాలకు సంబంధించి ఇచ్చిన ఉత్తర్వులన్నింటినీ రద్దు
చేస్తూ ఈ తాజా ఉత్తర్వులే అమల్లోకి వస్తాయని ఆర్థికశాఖ అధికారులు పేర్కొన్నారు.
అన్ని ప్రభుత్వ శాఖల్లో పనిచేసే కాంట్రాక్టు ఉద్యోగులు, యూనివర్సిటీలు,
సొసైటీలు, మోడల్ స్కూళ్లలోని కాంట్రాక్టు
ఉద్యోగులందరికీ ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని వివరించారు. 2015 సవరించిన మినిమం
టైంస్కేలుకు సమానంగా మొత్తం వేతనం ఉంటుంది. ఏ ఇతర భత్యాలు చెల్లించబోమని, ఏటా ఇచ్చే ఇంక్రిమెంట్లు వర్తించబోవని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.
ప్రభుత్వంలో కన్సల్టెంట్లుగా, ప్రత్యేకాధికారులుగా
నియమితులైన కాంట్రాక్టు ఉద్యోగులకు ఈ ఉత్తర్వులు వర్తించబోవు.
Finance Department – Contract Employment
- Remuneration & Other Benefits Comprehensive orders – Issued.
G.O.MS.No. 40 Dated: 18-06-2021
0 Komentar