AP
Covid-19 Media Bulletin 01-06-2021
ఏపీలో
కొత్తగా 11,303 కరోనా కేసులు
ఏపీలో
కరోనా కేసుల తీవ్రత కొంత మేర తగ్గుముఖం పట్టింది. రాష్ట్రంలో గత 24 గంటల్లో 93,704 మంది నమూనాలను
పరీక్షించగా 11,303 మందికి కొవిడ్ నిర్ధారణ అయింది. 104 మంది కరోనా బారిన పడి మృతి చెందారు.
అత్యధికంగా పశ్చిమగోదావరి జిల్లాలో 20 మంది మృతి
చెందారు. నిన్న ఒక్క రోజే కరోనా నుంచి 18,257 మంది
కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,46,737 యాక్టివ్
కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకు 1,00,17,712 మందికి
కొవిడ్ వ్యాక్సిన్ అందించినట్టు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. 74,92,944 మంది మొదటి డోసు, 25,24,768 మంది రెండో డోసు తీసుకున్నారు.
0 Komentar