AP
Covid-19 Media Bulletin 02-06-2021
ఏపీలో
కొత్తగా 12,768 కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్
కరోనా కేసులు క్రమంగా తగ్గు ముఖం పడుతున్నాయి. కొత్తగా 12వేలకు పైగా కేసులు
నమోదయ్యాయి. గత 24 గంటల్లో 98,048 శాంపిల్స్ పరీక్షించగా 12,768 మంది కరోనా
బారినపడినట్లు వైద్య, ఆరోగ్యశాఖ
తెలిపింది. అదే సమయంలో 15,612మంది కరోనా నుంచి కోలుకోవడం గమనార్హం. దీంతో మొత్తం
కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 15,62,229లకు చేరింది.
ఇక
గత 24 గంటల్లో కరోనాతో బాధపడుతూ 98మంది మృతి చెందారు. అత్యధికంగా చిత్తూరులో
15మంది చనిపోగా, నెల్లూరు, 10, పశ్చిమగోదావరి 9, అనంతపురం
8, తూర్పుగోదావరి 8, విజయనగరం 8,
గుంటూరు 7, ప్రకాశం 7, శ్రీకాకుళం
7, విశాఖపట్నం 6, కృష్ణా 5, వైఎస్‌ఆర్ కడప 4, కర్నూలులో నలుగురు
మృత్యువాతపడ్డారు. రాష్ట్రంలో కరోనా కారణంగా మొత్తం 11,132మంది కన్నుమూశారు.
ఇప్పటివరకూ 17,17,156మంది కరోనా బారిన పడగా, ప్రస్తుతం
రాష్ట్రంలో 1,43,795 యాక్టివ్ కేసులున్నాయి.
0 Komentar