AP
Covid-19 Media Bulletin 09-06-2021
ఏపీలో
కొత్తగా 8,766 కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్లో
గడిచిన 24 గంటల్లో 93,511 పరీక్షలు నిర్వహించగా.. 8,766 కేసులు నిర్ధారణ
అయ్యాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 17,79,773 మంది వైరస్ బారినపడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ఈ
మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది.
గడిచిన
24 గంటల వ్యవధిలో కొవిడ్ వల్ల 67 మంది బాధితులు ప్రాణాలు కోల్పోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 11,696కి చేరింది. 24 గంటల వ్యవధిలో 12,292 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 16,64,082కి చేరినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,03,995 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 2,00,39,764 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది. అత్యధికంగా తూర్పు గోదావరిలో 1,980,
అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 265 కేసులు
నమోదయ్యాయి.
0 Komentar