AP
Covid-19 Media Bulletin 12-06-2021
ఏపీలో
కొత్తగా 6,952 కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్లో
గడిచిన 24 గంటల్లో 1,08,616 పరీక్షలు నిర్వహించగా, 6,952
కేసులు నిర్ధారణ అయ్యాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 18,03,074 మంది వైరస్ బారినపడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ఈ
మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొవిడ్ వల్ల 58 మంది బాధితులు
ప్రాణాలు కోల్పోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 11,882కి
చేరింది.
24 గంటల వ్యవధిలో 11,577 మంది బాధితులు పూర్తిగా
కోలుకొని ఇళ్లకు వెళ్లిపోయారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 16,99,775 మంది బాధితులు కొలుకున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో
91,417 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా
ఇప్పటివరకు 2,03,48,106 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది.
అత్యధికంగా చిత్తూరులో 1,199 కేసులు, అత్యల్పంగా
నెల్లూరు జిల్లాలో 228 కేసులు నమోదయ్యాయి.
0 Komentar