పరీక్షల పై కేంద్ర మంత్రికి ఏపీ విద్యాశాఖ మంత్రి లేఖ
సీబీఎస్ఈ పరీక్షలపై ఇటీవల కేంద్ర
విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖియాల్ నిర్వహించిన సమావేశంలో మంత్రి ఆది మూలపు సురేష్
రాష్ట్రం అభిప్రాయాలను వివరించారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని
కోవిడ్ తగ్గుముఖం పట్టాక పరీక్షల నిర్వహణ మంచిదని పేర్కొన్నారు. దీనిపై లిఖిత
పూర్వకంగా లేఖ ద్వారా అభిప్రాయాలను కేంద్రానికి పంపారు. ఇప్పటికే ప్రాక్టికల్స్
నిర్వహించామని, థియరీ పరీక్షలకూ అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు.
ఫస్టియర్, సెకండియర్ విద్యార్థులకు 8 రోజుల్లో
పరీక్షలు పూర్తవుతాయని, 5 లేదా ఆరు పేపర్లు మాత్రమే రాసేలా
ఏర్పాట్లు చేశామని వివరించారు.
కోవిడ్ కేసులు కారణంగా పరీక్షలు
వాయిదా వేశామని, తదుపరి కొత్త షెడ్యూల్ ను 15 రోజులు
ముందు విద్యార్థులకు తెలియచేస్తామన్నారు. మూల్యాంకనం, ఫలితాల
ప్రకటనకు 40 రోజుల సమయం అవసరమవు తుందన్నారు. 2 నెలల్లో మొత్తం ప్రక్రియ పూర్తవుతుందన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల
మేరకు కోవిడ్ కేసులు తగ్గాక ఆగస్టులో 10+2 (ఇంటర్మీడియెట్)
పరీక్షలు నిర్వహించవచ్చనే అభిప్రాయంతో ఉన్నట్లు పేర్కొన్నారు. పరీక్షల నిర్వహణకు
వీలుగా సిబ్బంది కోసం అదనంగా వ్యాక్సిన్లను సరఫరా చేయాలని కోరారు. సీబీఎస్ఈ బోర్డు
తన పరిధిలోని పరీక్షలపై నిర్ణయం తీసుకున్నా రాష్ట్రంలో పరీక్షలపై ఇంటర్ బోర్డు
నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో జూలైలో పరిస్థితులను మదింపు చేసుకొని
ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి ముందుకు వెళ్లాలని భావిస్తున్నారు.
0 Komentar