ఏపి: 8 వ తరగతి వరకు ‘సెమిస్టర్’ పుస్తకాలు - పాఠశాల విద్యాశాఖ కసరత్తు
రాష్ట్రంలో ఈ విద్యా సంవత్సరం 1-8
తరగతుల పాఠ్య పుస్తకాలను సెమిస్టర్ల వారీగా అందించనున్నారు. 1-7 తరగతుల పుస్తకాలను
ఆంగ్ల,
తెలుగు మాధ్యమాల్లో ముద్రించారు. తెలుగు పాఠం పక్కనే ఆంగ్ల పాఠం
ఉంటుంది. గతేడాది 1-6 పాఠ్య పుస్తకాలను మార్పు చేయగా, ఈ
ఏడాది ఏడో తరగతి పుస్తకాలు మారాయి. ఎనిమిదో తరగతి పాత పాఠ్యాంశాలనే రెండుగా
విభజించి సెమిస్టర్లుగా ముద్రించారు. ఇప్పటికే ఒక సెమిస్టర్ పుస్తకాలను మండల
స్థాయి వరకు సరఫరా చేశారు. 6, 7, 8
పాఠ్య పుస్తకాలు రెండు సెమిస్టర్లుగా ఉండగా.. 1-5 వరకు మూడు సెమిస్టర్లుగా
ముద్రిస్తున్నారు.
పరీక్షల విధానం, తరగతి
గది బోధనలోనూ మార్పులు తీసుకురావాలని పాఠశాల విద్యాశాఖ భావిస్తోంది. ఇందుకు జిల్లా
ఉమ్మడి పరీక్షల మండలి (డీసీఈబీ), ప్రభుత్వ పరీక్షల విభాగాలకు
శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది. విద్యార్థుల విజ్ఞానాన్ని పరీక్షించేలా
ప్రశ్నపత్రం తయారు చేయాలని భావిస్తోంది. ప్రస్తుతం జవాబు పత్రాల మూల్యాంకనాన్ని ఏ
పాఠశాలకు ఆ పాఠశాలలోనే చేస్తున్నారు. ఈ ప్రక్రియ సమగ్రంగా ఉండటం లేదని విద్యాశాఖ
అభిప్రాయ పడుతోంది.పరీక్షలు ముగిశాక జవాబు పత్రాలను మరొక పాఠశాలకు పంపి మూల్యాంకనం
చేయించాలని భావిస్తోంది.
0 Komentar