AP: రేపటి (జులై 1) నుంచి పాఠశాలలకు
ఉపాధ్యాయులు హాజరు
ఉపాధ్యాయులందరూ జులై ఒకటి నుంచి
పాఠశాలలకు రోజు విడిచి రోజు హాజరుకావాలని మంత్రి ఆదిమూలపు సురేష్ ఆదేశించారు.
టీసీల జారీ, విద్యార్థుల ఆన్లైన్ వివరాల నమోదులాంటి పనులను పూర్తి
చేయాల్సి ఉంటుందని వెల్లడించారు. విద్యాశాఖ ఉన్నతాధికారులతో మంత్రి మంగళవారం
సమీక్ష నిర్వహించారు. జులై 15 నుంచి ఆగస్టు 15 వరకు విద్యార్థులకు వర్క్ షీట్లు
ఇవ్వడం, పాఠశాలల పునఃప్రారంభానికి సన్నాహక కార్యక్రమాలు
నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
మరుగు దొడ్ల నిర్వహణ నిధి, ఆయాలకు
చెల్లించాల్సిన వేతనాలు, సెలవు రోజుల్లో వారి సేవల
వినియోగంపై విధివిధానాలు రూపొందించాలని అధికారులను ఆదేశిం చారు. మధ్యాహ్న భోజనం
వంట చేసేవారికి వేతనాలు పెండింగ్పైనా చర్యలు తీసుకోవాలని సూచించారు. సీఎఫ్ఎంఎస్
సాంకేతిక సమస్యలు ఉన్నాయని. కొన్ని జిల్లాలకు చెల్లింపులు పూర్తయ్యాయని అధికారులు
వెల్లడించారు.
0 Komentar